పాలు, లేదా జ్యూస్‌తో పాటు మందులు ఎందుకు తీసుకోకూడదో తెలుసా?

గోరువెచ్చని పాలతో మందులు తీసుకోవాలని చాలామంది చెబుతుంటారు.ఇలా చేయడం ద్వారా మందులు మరింత మెరుగ్గా పనిచేస్తాయని, వాటి ప్రభావం చక్కగా మారుతుందని వారు భావిస్తారు.

 Do You Know Why You Should Not Take Medicines Along With Milk Or Juice, Milk ,-TeluguStop.com

అయితే సైన్స్ దీనిని అంగీకరించదు.బాధితులు.

టీ, పాలు, జ్యూస్‌తోపాటు మందులను తీసుకుంటే ఆ మందుల ప్రభావం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.పాలు, జ్యూస్‌తో మందులు ఎందుకు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యూస్, పాలు వంటి పానీయాలు ఔషధ ప్రభావాన్ని తగ్గిస్తాయని జర్మన్ అసోసియేషన్ ఆఫ్ ఫార్మసిస్ట్ ప్రతినిధి ఉర్సులా సెల్లర్‌బర్గ్ చెప్పారు.పాలలో కాల్షియం ఉంటుంది, ఇది ఔషధంలో ఉన్న గుణాలను రక్తంలోకి రాకుండా చేస్తుంది.

ఫలితంగా ఔషధ ప్రభావం తగ్గుతుంది.కొంతమంది జ్యూస్‌తో మందులు తీసుకుంటారు.

ఇలా చేయడం తప్పు.

జ్యూస్ అనేది ఔషధం శరీరంలో కరిగిపోవడానికి సహాయపడే ఎంజైమ్‌ను అడ్డకుంటుంది.

ఫలింగా ఔషధ ప్రభావం తగ్గుతుంది.లేదా ఔషధం దాని ప్రభావాన్ని ఆలస్యంగా ఉంటుంది.

అందుకే నీటితో మందులు తీసుకోవడం ఉత్తయం.కాగా ఔషధాలను డాక్టర్ సలహా లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేయకూడదు.

వీటిని మన ఇష్టానుసారం ఉపయోగించకూడదు.దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికను కూడా జారీ చేసింది.

ఖాళీ కడుపుతో మందులు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.దీనికి అతి పెద్ద కారణాలలో ఒకటి కడుపులో మంట.కొన్ని మందులను ఖాళీ కడుపుతో తీసుకుంటే అనేక సమస్యలను తెచ్చిపెడతాయి.అందకే ఎదైన తిన్న తరువాతనే మందులను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube