'మెట్టెలు' పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసా?

Do You Know Why Women Wear Silver Ring After Marriage Silver Ring, Married Women, Marriage Rituals, Traditions Of Indian Culture

మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఆడవారు మంగళ సూత్రం, గాజులు, సింధూరం పెట్టుకోవడంతో పాటు మెట్టెలు పెట్టుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది.పెళ్లి జరిగిందని చెప్పడానికి ప్రతీకగా అమ్మాయిలకు మెట్టెలు తొడుగుతారు.

 Do You Know Why Women Wear Silver Ring After Marriage Silver Ring, Married Wome-TeluguStop.com

మెట్టెలను కొన్ని ప్రాంతాలలో వధువు మేనమామ తన కాలి బొటనవేలు పక్కన ఉన్న వేలికి తొడుగుతారు.మరికొన్ని ప్రాంతాలలో స్వయంగా వరుడు వధువు కాళ్ళకి మెట్టెలు తొడుగుతారు.

ఈ కాలి మెట్టెలను వధువుకు ఐదవతనం గా భావించి పెళ్లి రోజున తన కాలి వేళ్ళకు తొడుగుతారు.

కాళ్ళ మెట్టెలు ధరించడం వెనుక కేవలం సంస్కృతి సాంప్రదాయ మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి.

మన శరీరంలో అన్ని అవయవాలకు సంబంధించి ప్రధాన నాడీ కేంద్రాలు ఉంటాయి.ఆ నాడీ వ్యవస్థ మన శరీరకొన భాగాల లో ఉండటం వల్ల, ఆ కొనల్ని మనం ప్రేరేపించినప్పుడు ఆనాడు లకు సంబంధించినటువంటి అవయవాలు ఎంత చురుకుగా పనిచేస్తాయని సైన్స్ చెబుతోంది.

మన కాలి బొటనవేలు మధ్యలో గుంతగా ఉండటంవల్ల మనం నడిచినప్పుడు నేలను తాకదు.అందువల్ల వేలి మధ్యభాగంలో మెట్టెలు తొడుగుతారు.

అలా మెట్టెలు తొడగడం వల్ల మనం నడిచిన ప్రతి సారి భూమి తాకడం వల్ల అక్కడ ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ప్రధానంగా మన గర్భాశయానికి సంబంధించినవి.మనం నడిచిన ప్రతి సారీ ఆ నాడులను ప్రేరేపించడం వల్ల గర్భాశయ సమస్యలు తగ్గిపోయి, ప్రత్యుత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అందువల్ల గర్భధారణ తొందరగా జరిగి వారికి సంతానం కలుగుతుంది.

అందుకోసమే మన పెద్దవారు మెట్టెలు ధరించడం మన సంస్కృతిలో ఒక భాగంగా భావించి పెళ్లైన వధువుకు కాలి మెట్టెలు తొడుగుతారు.

ఈ మెట్లను సౌభాగ్యానికి ప్రతీకగా భావించి పెళ్లైన ఆడవారికి అతి ముఖ్యమైన ఆభరణంగా ధరించడం ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube