అప్పట్లో బండగా ఉన్న మంచు విష్ణు సన్నగా ఎందుకు.. ఎలా మారిపోయాడో తెలుసా?

ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొన్ని కొన్ని సమయాలలో సినిమాల కోసం మాత్రమే బరువు పెరుగుతుంటారు.అంతేకానీ రియల్ లైఫ్ లో మాత్రం అసలు బరువు పెరగరు.

 Do You Know Why Vishnu Fat At The Time But Now He Was Thin And How It Changed-TeluguStop.com

ఎందుకంటే బరువు పెరిగితే మాత్రం తమ సినీ కెరీర్ మొత్తం దెబ్బతింటుంది.కానీ అనుకోకుండా కొన్ని కొన్ని సమయంలో వారికి తెలియకుండానే నిజజీవితంలో బరువు పెరుగుతుంటారు నటీనటులు.

ఇక సన్నగా కావడానికి మాత్రం బాగా కష్టపడుతుంటారు.ఇదిలా ఉంటే ఒకప్పుడు మంచు విష్ణు కూడా చాలా బండ గా ఉండేవాడు.

 Do You Know Why Vishnu Fat At The Time But Now He Was Thin And How It Changed-అప్పట్లో బండగా ఉన్న మంచు విష్ణు సన్నగా ఎందుకు.. ఎలా మారిపోయాడో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇప్పుడు మంచి ఫిజిక్ తో ఉన్నాడు.ఇంతకూ అలా మారడానికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.

బాలనటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచి విష్ణు.తొలిసారిగా 1985లో రగిలే గుండెలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.ఇక 2003లో విష్ణు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమాలో ఉత్తమ నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత వరుస సినిమాలలో నటించగా.ఇందులో కొన్ని అతిథి పాత్రలలో, మరికొన్ని హీరో పాత్రలలో నటించాడు.

దాదాపు 22 పైగా సినిమాలలో నటించగా ఇటీవలే మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈయన గతంలో చాలా లావుగా ఉండే వాడు.

అయితే తాను సన్నగా కావడానికి ఓ కారణం ఉంది.అదేంటంటే గతంలో వై.

వి.యస్.చౌదరి దర్శకత్వంలో సలీమ్.దుమ్ము రేపుతాడు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశం దగ్గర రొమాన్స్ చేసే ప్రేమికుని పాత్ర కోసం విష్ణు ని బాగా సన్నబడాలి అని డైరెక్టర్ చౌదరి మరీ మరీ చెప్పాడని తెలిసింది.అయితే విష్ణు మాత్రం అస్సలు ఒప్పుకోలేదట.

కొందరు వచ్చి విష్ణుతో సన్నబడాలి అని బాగా బ్రతిమాలారని తెలిసింది.దాంతో విష్ణు దర్శకుడి మాటలను కాదనలేక కష్టపడి బాగా వర్క్ ఔట్ లు, డైట్ వంటివి చేసి బాగా సన్నబడిపోయాడు.

దాంతో విష్ణు ని చాలా వరకు ఎవరు గుర్తు పట్టలేకపోయారు.ఇక ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ ను చూసి డైరెక్టర్ చౌదరి కూడా మంచు విష్ణును సన్నగా చేయాలని డిసైడ్ అయ్యాడని తెలిసింది.

Telugu Fat, Film Industry, Hero, Manchu Vishnu, Tollywood-Movie

అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా లావుగా ఉండేవాడు.ఈయన మరో స్టార్ డైరెక్టర్ రాజమౌళి చెప్పడంతో సన్నగా మారాడని తెలిసింది.ఆ తర్వాత ఎన్టీఆర్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక లావు గా ఉన్నప్పుడు కంటే సన్నగా అయ్యాక మరిన్ని అవకాశాలు అందుకుని స్టార్ గా నిలిచాడు.

అలా ఎన్టీఆర్ ను ఉద్దేశించి విష్ణు కి సలహా ఇవ్వడంతో విష్ణు కూడా సన్న బడ్డాడు.దాంతో మంచి ఫిజిక్ సంపాదించుకొని ఇప్పటికి కూడా అలానే ఉన్నాడు.

ఇక ఈయన ఈ ఏడాది మోసగాళ్లు సినిమాతో ముందుకు రాగా ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.ప్రస్తుతం మంచు విష్ణు మా ఎలక్షన్ లో కూడా పోటీ చేయడానికి వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ గురించి చర్చ జరుగగా.దీంతో ఈమధ్య మంచు విష్ణు మా ఎలక్షన్స్ సందర్భంగా బాగా మీడియా ముందుకు వస్తున్నాడు.

#Manchu Vishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు