కవల అరటిపళ్లను తాంబూలంలో ఎందుకు పెట్టకూడదో తెలుసా..?

సాధారణంగా మనం ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు ఆ శుభకార్యంలో అరటిపండ్లు ముందు వరుసలో ఉంటాయి.ఈ విధంగా అరటిపళ్లను సమర్పించడం వల్ల శుభం జరుగుతుందని భావిస్తారు.

 Do-you-know-why-twin-bananas-should-not-be-put-in-thambulam Twin Bananas, Tamboo-TeluguStop.com

అయితే శుభకార్యం అనంతరం ముత్తయిదువులకు ఇచ్చే తాంబూలంలో అరటి పండ్లను తాంబూలంగా ఇవ్వడం మనం చూస్తుంటాము.అదేవిధంగా అరటి పండ్లలో ఒక్కోసారి కవల అరటి పండ్లు రావడం మనం చూస్తూనే ఉంటాం.

కవల అరటి పండ్లను చిన్నపిల్లలు తినకూడదని, తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదని చెబుతారు.ఆ విధంగా కవల అరటి పండ్లను తాంబూలంలో ఎందుకు పెట్టి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

Telugu Banana Tree, Sri Mahavishnu, Tamboolam, Twin Bananas-Telugu Bhakthi

పురాణాల ప్రకారం అరటి చెట్టు మరెవరో కాదు సాక్షాత్తు దేవ నర్తకి రంభ స్వరూపమే.శ్రీ మహావిష్ణువు దగ్గర నర్తకిగా వున్నా రంభ తను అందగత్తెనని అహంకారంగా వ్యవహరిస్తుండడంతో ఆమెను భూలోకంలో అరటి చెట్టుగా జన్మించవలసిందిగా విష్ణుమూర్తి శాపం పెడతాడు.తన తప్పును తెలుసుకున్న రంభ స్వామి వారిని శాపం నుంచి విముక్తి కలిగించమని వేడుకోగా, అప్పుడు విష్ణుమూర్తి తనకు దేవుడికి నైవేద్యంగా ఉండే ఒక పవిత్రమైన పండు అర్హతను కల్పిస్తాడు.ఇంతటి పవిత్రమైన అరటి పండ్లలో ఎలాంటి దోషాలను చూడకూడదు.

జంట అరటిపండ్లను నిస్సంకోచంగా ఆ దేవతలకు నైవేద్యంగా సమర్పించవచ్చు, అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.కవల అరటి పండ్లలో రెండు ఉన్నప్పటికీ, అది ఒక్క పండు కిందనే సమానం.

కాబట్టి తాంబూలంలో ఒక పండును ఇవ్వకూడదు కాబట్టి జంట (కవల) అరటి పండును సైతం తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.అదేవిధంగా ఈ కవల అరటిపండును పెళ్లయిన యువతులు తింటే వారికి కవలలు పుడతారని చెబుతుంటారు.

ఇవన్నీ కేవలం వారి అపోహ మాత్రమేనని ఈ సందర్భంగా ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube