మనచుట్టూ వున్న అనేకమంది నిత్యం రైలు ప్రయాణాలు చేస్తూ వుంటారు.దూరపు ప్రాంతాలకు వెళ్లేటపుడు అనేకమంది రైళ్లనే ఆశ్రయిస్తారు.
అయితే రైళ్లకు సంబంధించిన చాలా విషయాలు గురించి మనం అస్సలు ఆలోచించం.అందులో ఒక అంశమే రైలు పైకప్పుపై గుండ్రని ఆకారం.
అవును, సాధారణంగా ఎటువంటి రైలుని మనం చూసుకున్నా దాని పై కప్పులు అర్ధచంద్రాకారపు ఆకారాన్ని కలిగి ఉంటాయి.అయితే ఇలా ఎందుకో మీరు ఎపుడైనా ఆలోచించారా? అవి దేనికోసం అలా ఏర్పాటు చేయబడ్డాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? .
బయట గుండ్రంగా వున్న ఆకారం మాత్రం కోచ్ల లోపల భాగంలో కనిపించవు.బ్రిడ్జిల నుంచి లేదా రైల్వే ఓవర్ బ్రిడ్జిల నుంచి రైలు పైకప్పులను గమనిస్తే మీకు అర్ధం అవుతుంది.
ఇంచుమించుగా అన్ని చోట్ల ఈ విధమైన నిర్మాణమే కనిపిస్తుంది.అయితే వాటిని అమర్చడం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉందని మీకు తెలుసా? ఈ మూతలు కేవలం డిజైన్ కోసం మాత్రమే కాదు.రైలులో ఉన్న ప్రయాణీకులు సౌకర్యంగా ఉండేందుకు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయి.వీటిని రూఫ్ వెంటిలేటర్లు అని అంటారు.

ఇవి కోచ్ లోపల ఉన్న ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి.కోచ్లలో ప్రయాణికుల సంఖ్య పెరిగినపుడు అధిక వేడి ఉత్పత్తి అవుతుందనే విషయం మీకు తెలుసా? అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు లోపల కూర్చోవడం చాలా కష్టమవుతుంది.ప్రయాణికులకు అలాంటి అసౌకర్యం ఎదురుకాకుండా ఉండేందుకు రైల్వే వారు ఈ ఏర్పాటు చేశారు.వేడి గాలి అనేది పైకి పోతూ ఉంటుంది.అలా పైకి ప్రయాణించిన గాలి ఈ రూఫ్ వెంటిలేటర్ల గుండా బయటకు వెళ్లిపోతుందన్నమాట.కిటికీలు ఉన్నప్పటికీ వేడి గాలిని బయటకు పంపడంలో రూఫ్ వెంటిలేటర్లది చాలా కీలక పాత్ర.
ఒకవేళ వర్షం పడినా నీరు లోపలికి వెళ్లకుండా ఉండేలా వీటిని రూపొందించారు.
