కారు వెనుక భాగంలో అద్దంపై గీతలు ఎందుకుంటాయో మీకు తెలుసా?

నేటి యువత కార్ల పట్ల యెంత మోజుతో వుంటారో తెలిసిందే.బైక్స్ తరువాత వీరు ఎక్కువగా ఇష్టపడేది వీటినే.

 Do You Know Why There Are Scratches On The Rear View Mirror Of The Car , Car Bac-TeluguStop.com

తాజా సర్వేలో తేలింది ఏమంటే… ఇక్కడ యువత ఎక్కువగా కార్ల గురించి గూగుల్ ఎక్కువగా రీసెర్చ్ చేశారట.అవును.

మరీ ముఖ్యంగా కారు వెనభాగాన వున్న అడ్డమైన అడ్డంగా గీతలు ఉంటాయి.అవి అలా ఎందుకుంటాయో వెతికారని సమాచారం.ఈ నేపథ్యంలో అదే విషయం గురించి ఇపుడు తెలుసుకుందాం.రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతోంది.ఈ క్రమంలో మానవుడు ఎంతో అభివృద్ధి సాధించాడు.

అయితే ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉపయోగకరమైనటువంటి చిన్న చిన్న అంశాలని మనం గమనించకుండా వదిలేస్తూ ఉంటాం.

అందులో ఒక అంశమే ఈ కార్ విండోస్ పైన ఉపయోగించిన టెక్నాలజీ.ఇపుడు దాని గురించి మాట్లాడుదాం.కారు విండోస్ పై వైపర్ బ్లేడ్స్ ఉంటాయి.వర్షం పడే సమయంలో అవి ముందుకు ప్రయాణించడానికి ఉపయోగపడతాయి.

ఇక దాని తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే విండ్ షీల్డ్ లైన్స్.ఈ సన్నని లైన్స్ ని కారు వెనుక విండోస్ మీద చాలామంది గమనించే ఉంటారు.కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోరు.నిజానికి దీని వెనుక చాలా పెద్ద విషయమే ఉంది.

Telugu Car, Car Windows, Defoggers, Latest, Wind Shield, Wiper Blades-Latest New

విండోస్ మీద ఉండే ఈ లైన్స్ ని Defoggers అని పిలుస్తారు.ఇవి ఎలక్ట్రికల్ లైన్స్.వీటిగుండా కరెంటు ప్రవహిస్తుంది.దానివలన గ్లాస్ వేడెక్కుతుంది.విండో మీద చేరిన తేమ మంచు ఆ వేడి వల్ల తొలగిపోయి ఒక స్పష్టమైన వ్యూ కనిపిస్తుంది.ఈ చిన్న విషయం చూసే వాళ్ళకి పెద్ద టెక్నాలజీగా అనిపించకపోవచ్చు.

కానీ ప్రయాణికుల భద్రత సౌకర్యానికి ఎంతో బాగుంటుంది.మీరు కూడా ఈ సారి లాంగ్ డ్రైవ్ వి వెళ్లినప్పుడు ఆ లైన్స్ పనితనాన్ని గమనించండి.

అపుడు మీకే చాలా క్లియర్ గా అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube