ఫోన్ వాడకపోయినా చార్జింగ్ ఎందుకు డౌన్ అవుతోందో తెలుసా?

ఫోన్ ఛార్జింగ్ వెంటనే అయిపోవడం లాంటి సమస్య చాలా స్మార్ట్ ఫోన్లలో సాధారణంగా ఉంటుంది.కొత్త ఫోన్ అయినా సరే కొద్దిరోజులకే బ్యాటరీ పవర్ తగ్గిపోతుంది.

 Do You Know Why The Phone Keeps Charging Even When Not In Use , Phone ,charge Do-TeluguStop.com

ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండటం లేదు.నాలుగైదు గంటలకే ఛార్జింగ్ అయిపోతుంది.

దీంతో దూరప్రాంతాలకు వెళ్లేవారు, జర్నీలు చేసేవాళ్లు ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇక కొన్ని ఫోన్లలో అయితే ఫోన్ వాడకపోయినా సరే ఛార్జింగ్ డౌన్ అవుతూ ఉంటుంది.

స్మార్ట్ ఫోన్ యూజర్లకు బ్యాటరీ గురించి ఆందోళన పెరిగిపోయింది.అయితే ఫోన్ వాడకపోయినా ఛార్జింగ్ ఎలా తగ్గుతుందనే దానకి అనేక కారణాలు ఉన్నాయి.ఫోన్ వాడకుండా అలా ఉంచినా.మనకు కాల్స్, మెసేజ్ లు, మెయిల్స్, నోటిఫికేషన్స్ లాంటివి వస్తూ ఉంటాయి.

మనం ఫోన్ వాడకపోయినా బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తూనే ఉంటుంది.ఫోన్ వాడకుండా అలా ఉంచినా వాట్సప్ మెసేజ్ లు, ఇతర పనులన్నీ జరుగుతూ ఉంటాయి.

దీంతో ఫోన్ పనిచేస్తున్నట్లే లెక్క.అందుకే ఫోన్ వాడకపోయినా బ్యాక్ గ్రౌండ్ లో జరిగే వర్క్ వల్ల ఛార్జింగ్ డౌన్ అవుతూ ఉంటుంది.

Telugu Background, Charge, Phone, Smart, Ups-Latest News - Telugu

ఫోన్ వాడకపోయినా సిమ్ కార్డు సిగ్నల్ వస్తుంది.ఈ ఫోన్ సిగ్నల్ వల్ల కూడా ఛార్జింగ్ తగ్గుతుంది.సిగ్నల్ లో హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి.ఇక ప్రయాణాల్లో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళుతున్నప్పుడు సిగ్నల్ లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి.దీని వల్ల ఫోన్ ఛార్జింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది.ఇక బస్, ట్రైన్ ప్రయాణం సమయంలో ఫోన్ ఛార్జింగ్ చాలా త్వరగా తగ్గుతూ ఉంటుంది.

ఇలా ఫోన్ వాడకపోయినా బ్యాక్ గ్రౌండ్ లో ఫోన్ పనిచేయడం, సిగ్నల్ లో హెచ్చుతగ్గుల వల్ల ఫోన్ ఛార్జింగ్ తగ్గుతూ ఉంటుంది.అందుకే ఫోన్ లో పవర్ మోడ్ ఆన్ చేసుకోవడం, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవడం వల్ల ఛార్జింగ్ ను సేవ్ చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube