ఆ కుటుంబాన్ని రెడ్ అండ్ వైట్ ఫ్యామిలీ అని ఎందుకు అంటారో తెలుసా.?

మన అందరికి నచ్చిన కలర్స్ ఒకటి రెండు ఉంటాయి కదా.అన్నిటికంటే ఆ నచ్చిన కలర్స్ నే మనం ఫేవరెట్ కలర్స్ అంటూ ఉంటాము.

 Do You Know Why The Family Is Called The Red And White Family Community Verified Icon-TeluguStop.com

ఏదైనా కొనాలన్నా ముందు నచ్చిన కలర్స్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము.ఒకవేళ అవి లేకపోతే వేరే వాటిని సెలెక్ట్ చేసుకుంటాము.

అలా అని ఎంతసేపు నచ్చిన కలర్స్ నే వాడాలంటే విసుగు వస్తుంది కదా.కానీ.బెంగళూరుకు చెందిన ఒక ఫ్యామిలీ మాత్రం గత కొన్నేళ్లుగా కేవలం తమకి నచ్చిన రెడ్‌ అండ్‌ వైట్‌ కలర్స్‌ ను మాత్రమే వాడుతున్నారట.ఆ రంగులు తప్ప వాళ్ల జీవితంలో వేరే రంగు అనేది కనిపించదు.

 Do You Know Why The Family Is Called The Red And White Family Community Verified Icon-ఆ కుటుంబాన్ని రెడ్ అండ్ వైట్ ఫ్యామిలీ అని ఎందుకు అంటారో తెలుసా.-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాళ్లు వాడే ఆ రెండు కలర్స్ ను బట్టి వాళ్ళను ‘రెడ్‌ అండ్‌ వైట్‌ ఫ్యామిలీ’ అని అంటుంటారు.మరి ఒకసారి ఆ రెడ్ అండ్ వైట్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందామా.

బెంగళూరు నగరానికి చెందిన సెవెన్‌రాజ్‌ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబంలో ఏడో సంతానం అంట.అందుకే అతడినీ సెవెన్‌ రాజ్‌ అని పిలుస్తారు.ఇతను బెంగూలూరులో రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తుంటాడు.ఇతనికి రెడ్ అండ్ వైట్ అంటే మహా ఇష్టం అంట.అందుకే తన కంపెనీలో కూడా ఎక్కువగా రెడ్‌ అండ్‌ వైట్ కాంబినేషన్‌నే ఉపయోగిస్తాడు.ఒక్క ఆఫీస్ అనే కాదు ఆయన ఇల్లంతా రెడ్‌ అండ్‌ వైట్‌ కలర్‌ లోనే ఉంటుంది.

అలాగే ఇంట్లో ఉండే డోర్స్‌, ఫర్నిచర్‌, కర్టెన్స్‌, బెడ్‌షీట్స్‌, డెకొరేటివ్‌ ఐటమ్స్‌, ఎలక్ట్రానిక్స్‌, గాడ్జెట్స్‌, జువెలరీ, బట్టలు ఇలా ఇంట్లోని ప్రతిదీ రెడ్ అండ్ వైట్ రంగుల్లోనే ఉంటాయి.అతడు వాడే జీప్‌, కార్‌, బైక్‌ కూడా రెడ్‌ అండ్‌ వైట్‌ లోనే ఉంటాయి.

Telugu Banglore Family, Red And White Family, Social Meida, Viral Latest, Viral News-Latest News - Telugu

సెవెన్‌ రాజ్‌ ఒక్కడే కాకుండా అతడి భార్య, కొడుకు, కూతురు కూడా ఈ కలర్‌ డ్రెస్‌ లు మాత్రమే వాడతారు.ఒకవేళ ఈ కలర్స్‌ కాంబినేషన్‌లో మార్కెట్లో దొరక్కపోతే ప్రత్యేకంగా వైట్ అండ్ రెడ్ కలర్స్ లో ఆ వస్తువులను తయారు చేయించుకుంటాడు తెలుసా.అలాగే మనం సెవెన్ రాజు కి ఇంకో సెంటిమెంట్ కూడా ఉందండోయ్.

సెవెన్‌రాజ్‌కు ఈ రెండు కలర్స్‌తోపాటు, సెవెన్‌ నెంబర్‌ అంటే కూడా ఇష్టం అంట.తాను వేసుకునే సూట్‌, వెహికల్స్‌, ఫోన్‌ నంబర్స్‌ చివరలో సెవెన్‌ నెంబర్ కచ్చితంగా ఉండాల్సిందే అంట.ఈ కలర్స్‌, సెవెన్‌ నెంబర్‌ వల్ల ఈ ఫ్యామిలికి రెడ్ అండ్ వైట్ ఫ్యామిలీ గా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

#Banglore Family #RedAnd #Social Meida

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు