సిమ్ కార్డ్ ఎంత అద్భుతమైనదో కదా.దాన్ని మొబైల్ ఫోన్లో వేస్తే చాలు ప్రపంచమంతా దగ్గరవుతుంది.
అయితే మీ ఫోన్లోని సిమ్ కార్డ్‌కు మూల ఒక వైపు ఎందుకు కటింగ్ ఉంటుందోనని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ దగ్గర సమాధానం లేకపోయినా పర్వాలేదు.ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.
సిమ్ కార్డ్ యొక్క ఈ ప్రత్యేక డిజైన్ వెనుక ప్రధాన కారణం మొబైల్ ఫోన్.గతంలో మొబైల్ ఫోన్ల నుంచి సిమ్ కార్డ్‌ని తీయడం ఇబ్బందిగా ఉండేది.
ఎందుకంటే మొబైల్ ఫోన్లు అందుకు అనువుగా ఉండేవికాదు.మారుతున్న కాలంతో పాటు సాంకేతికత కూడా మారి మార్కెట్లోకి ఆధునిక ఫోన్లు వచ్చాయి.
వాటి నుంచి సిమ్ తీసి, తిరిగి సులభంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.అయితే గతంలో సిమ్ మూల కటింగ్ ఉండేదికాదు.మొబైల్ ఫోన్లలో సిమ్‌ని తీసి, తిరిగి ఇన్సర్ట్ చేసే టెక్నాలజీ అందుబాటులో లేదు.దీంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఈ సమస్యను గుర్తించిన టెలికాం కంపెనీలు సిమ్ డిజైన్‌ను మార్చాలని నిర్ణయించాయి.తద్వారా సిమ్‌ను ఇన్స్టాల్ చేయడంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించవచ్చని భావించాయి.
గతంలో సిమ్‌కి రివర్స్ మరియు స్ట్రెయిట్ సైడ్ ఏది అనేది తెలుసుకోలేకపోవడమే అతిపెద్ద సమస్యగా ఉండేది.
ఈ సమస్యను అధిగమించడానికి, టెలికాం కంపెనీలు సిమ్‌కు ఒక మూల కటింగ్ పెట్టాయి.మొబైల్లో ఎక్కడ సిమ్ ఇన్స్టాల్ చేయాల్సిన స్థలంలో కూడా ఇలాంటి కట్ మార్క్ ఉంటుంది.దీంతో వినియోగదారుల కష్టాలు తీరిపోయి ఫోన్లలో సిమ్‌ను సులభంగా పెట్టుకోవడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత నుంచి సిమ్‌పై కట్ మార్కులు కనిపించడం ప్రారంభించాయి.ఫోన్లలో అందుకు అనువైన ఏర్పాట్లు జరిగాయి.