పాప్‌కార్న్ ఎందుకు అంతలా జంప్ చేస్తుందో తెలుసా?

పాప్‌కార్న్ వేయించేట‌ప్పుడు మొక్కజొన్న గింజలు వికసించిన వెంటనే జంప్ చేస్తుంటాయి.అప్పుడు పాప్‌కార్న్‌ తినడానికి సిద్ధమ‌వుతుంది.

 Do You Know Why Popcorn Jumps So Much, Popcorn, Corn Kernels, Weather-TeluguStop.com

పాప్ కార్న్ వేడిచేసిన‌ప్పుడు ఎందుకు అంతలా దూకుతుంది? దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అనేక విషయాలు బయటపడ్డాయి.అవి అంద‌రినీ ఆశ్చర్యపరుస్తాయి.

పాప్‌కార్న్ ఎందుకు ఎక్కువగా దూకుతుందో తెలుసా? లైవ్ సైన్స్ నివేదిక ప్రకారం పాప్‌కార్న్ ఎగిరిప‌డ‌టానికి చాలా కారణాలు ఉన్నాయి.మొదటి కారణం అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచ‌డం.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 170 ° C వరకు వేడి చేసినప్పటికీ, మొక్కజొన్నలో 30 శాతం మాత్రమే పాప్‌కార్న్‌గా మారుతుంది.అదే సమయంలో 90 శాతం పాప్‌కార్న్ వేడిచేయ‌డానికి 180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం.

ఈ జంప్‌కు రెండవ కారణం.మొక్కజొన్నలో 10 నుండి 20 శాతం నీరు ఉంటుంది.

మొక్కజొన్నను వేడి చేసినప్పుడు దానిలో ఒత్తిడి పెరుగుతుంది.దానిలోని నీరు ఆవిరైపోతుంది.

దీంతో అది విచ్చుకుంటుంది.పాప్‌కార్న్‌ను వేడిచేసేటప్పుడు శబ్దం చేస్తుంది.

దీనికి కారణం కూడా అందులోని నీరే.దానిని వేడి చేసేట‌ప్పుడు దానిలోని నీరు కార‌ణంగా ఆవిరిని విడుదల చేయడానికి ఒత్తిడి ఏర్పడుతుంది.

దీంతో అది విచ్చుకుంటుంది.అది పేలినప్పుడు శబ్దం వస్తుంది.

వాటి లోపల ఒత్తిడి పెరగడం వల్ల అవి వేగంగా పేలుతాయి.దానిలోని స్టార్చ్ మాలిక్యూల్ మృదువైన రేకుల రూపంలో తయారవుతుంది.

కొంతమంది శాస్త్రవేత్తలు పాక్ కార్న్‌లోని పిండి పదార్ధం కారణంగానే అవి పేలుతాయ‌ని చెబుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube