సీతారామం సినిమాని మిస్ చేసుకున్న పూజ హెగ్డే.. ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా?

హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీ దత్ స్వప్న సంయుక్తంగా వైజయంతి మూవీస్ నిర్మాణంలో చిత్రం సీతారామం. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

 Do You Know Why Pooja Hegde Rejected Sitaramam Movie Details, Pooja Hegde,sitara-TeluguStop.com

ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలోనూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ సినిమా విడుదలైన ఫస్ట్ షో నుంచి క్రిటిక్స్ నుంచి ప్రేక్షకుల వరకు మంచి రివ్యూ రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా ద్వారా నటి మృణాల్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమెకు ఇకపై తెలుగులో అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.

ఇకపోతే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సీతారామం సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం బుట్ట బొమ్మ పూజా హెగ్డే కి వచ్చిందని చెప్పాలి.కథ విన్న పూజా హెగ్డే ఈ సినిమాని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Telugu Dulquer Salman, Heorinemrunal, Pooja Hegde, Poojahegde, Radheshyam, Sitar

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం చేయడానికి నిర్మాతలు భారీ బడ్జెట్ సెట్స్,ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని సినిమా షూటింగ్ కి సిద్ధమైన సమయంలో పూజా హెగ్డే కరోనా బారిన పడ్డారు.అదే సమయంలోనే ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరగడంతో నిర్మాతలు పూజా హెగ్డే కోసం ఎదురు చూడకుండా ఆమె స్థానంలో నటి మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేసుకోవడంతో పూజా హెగ్డే ఒక సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకుందని చెప్పాలి.ఈ సినిమాలో కనుక పూజా హెగ్డే నటించి ఉంటే వరుసగా ఫ్లాప్ అవుతున్న ఈమె సినిమాలకు బ్రేక్ వేయడమే కాకుండా రాదే శ్యామ్ వంటి బిగ్ డిజాస్టర్ సినిమా నుంచి ఈమె కాస్త రిలీఫ్ అయ్యేదని చెప్పాలి.మొత్తానికి కోవిడ్ వల్ల పూజా హెగ్డే ఒక మంచి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube