ఆ ముసలాయనకు పద్మశ్రీ ఇవ్వండి అంటున్న నెటిజన్స్... ఎందుకో తెలుసా...?

ప్రస్తుత రోజులలో ప్లాస్టిక్ వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ప్లాస్టిక్ వినియోగం ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న కూడా ఎవరూ వాటిని ఉపయోగించడం మాత్రం అదుపులో ఉండటం లేదు.

 Do You Know Why, Netizens Who Say Give Padma Shri To That Oldman, Kerala, Waste-TeluguStop.com

ప్లాస్టిక్ ఉపయోగం ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించాలనే ఒక చిన్న ఆలోచన తో 69 సంవత్సరాలు గల రాజప్పన్ చేసిన పనికి నెటిజన్లు జయహో అంటున్నారు.వాస్తవానికి ఇలా చేసేందుకు కొంత మంది అప్పటికప్పుడు ఫోటోలు తీసే వీడియోలు పెట్టేవారు.

కానీ, ఇతను మాత్రం అలా కాదు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన రోజు వెంబనాడ్ సరస్సులో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నాడు.నిజానికి అతనికి సొంత పడవ లేకున్నా సరే, ఓ చిన్న పడవను అద్దెకు తీసుకొని ప్లాస్టిక్ చెత్త బాటిళ్లను నదిలో నుంచి బయటకు తీసి పడవలో పెట్టి కాలుష్యం నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు.

రిటైర్మెంట్ వయసులో కూడా ఎవరు ఎలా పోతే నాకేంటి అని ఆలోచించకుండా అతను చేసిన పనికి అందరూ వావ్ అంటున్నారు.ఆ నది ఎప్పటికీ కూడా కాలుష్యం లేకుండా క్లీన్ గా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.

తాను స్వయంగా దీనితో వచ్చిన చెత్తను సేకరించి ప్లాస్టిక్ బాటిల్స్ ను దగ్గరలో ఉన్న ఒక ఏజెన్సీ కంపెనీకి అమ్ముకొని ఎంతో కొంత డబ్బును పోగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

Telugu Kerala, Muniyanikar, Netizens, Padmasri, Rajappan, Rajappancollect, Waste

ఈయన విషయంలో మరో షాకింగ్ అంశం ఏమిటి అంటే… ఐదేళ్ల వయసులోనే తనకు పోలియో వచ్చినప్పటి నుండి వైకల్యంతో బాధపడుతూ ఉంటాడు.ఆయనకు కాళ్లు కదిలేవి కాదు అందువల్లే… రోజువారి ఉద్యోగాలు ఏవి ఆయన సంపాదించుకోలేక పోయారు.అలాగని ఇతరులపై ఆధారపడకుండా తానే సొంతంగా చెత్తను సేకరించే పనిలో పడ్డాడు.

రాజప్పన్ మనియనికర్ గ్రామంలో ఒంటరిగా ఓ చిన్న ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాడు.గతంలో కేరళలో వచ్చిన వరదల్లో రాజప్ప ఇల్లు కొట్టుకుపోయింది.

దీనితో కొన్ని వారాల పాటు బోటునే ఇంటిగా చేసుకొని జీవనం కొనసాగించాడు కూడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube