మెగాస్టార్, టబు సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు సినిమాను తెరకెక్కించాలని అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా అక్కడితో ఆగిపోతుంది.మరికొన్ని సినిమాలకు ముహూర్తం ఫిక్స్ చేసి కొన్ని షెడ్యూల్ చిత్రీకరణ చేసుకున్న తర్వాత ఆగిపోయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు.

 Do You Know Why Megastar And Tabu Movie Stopped-TeluguStop.com

ఇలా కొన్నిసార్లు స్టార్ హీరోల విషయంలో కూడా జరుగుతుంటుంది.స్టార్ హీరోల సినిమాలను కూడా అధికారికంగా ప్రకటించి పూజా కార్యక్రమాలను జరుపుకుని షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు.

ఈ విధంగా సినిమా ప్రకటించి ఆగిపోయిన స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవికి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Do You Know Why Megastar And Tabu Movie Stopped-మెగాస్టార్, టబు సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా టబు హీరోయిన్ పాత్రలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “వినాలని ఉంది” అనే సినిమాను అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాకు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు.

Telugu Hero, Megastar Chiranjeevi, Movies, Stopped, Tabu, Tollwood-Movie

ఈ విధంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చిరంజీవి టబు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన వినాలని ఉంది చిత్రం కొన్ని షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకునే ఆ తర్వాత అర్ధంతరంగా ఆగిపోయింది.అయితే ఈ సినిమా మధ్యలో ఆగిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే చిరంజీవితో సినిమా మొదలు పెట్టిన తర్వాత రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయంటూ రాంగోపాల్ వర్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్లడం వల్ల ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.ఇదే కాకుండా మరొక వార్త కూడా అప్పట్లో పెద్దఎత్తున చక్కర్లు కొట్టింది.రామ్ గోపాల్ వర్మ స్క్రిప్ట్ పై చిరంజీవి గారికి అనుమానం రావడం చేత స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాలని చిరంజీవి చెప్పినప్పటికీ వర్మ వినకపోవడంతో ఈ సినిమాను మధ్యలోనే ఆపినట్లు కూడా వార్తలు వినిపించాయి.

ఏదేమైనా అప్పట్లో ఒక సూపర్ హిట్ కాంబినేషన్ సినిమా మిస్ అయిందని చెప్పవచ్చు.

#Tabu #Tollwood #Stopped

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు