పెళ్లి అయిన మహిళలు నల్లపూసలు ఎందుకు ధరిస్తారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి అయిన తర్వాత మహిళ కొన్ని ఆభరణాలను కచ్చితంగా ధరించాల్సి ఉంటుంది.అందులో ముఖ్యంగా మంగళసూత్రం, కాలి మెట్టెలు,

నల్లపూసలు

ఇవన్నీ పెళ్లయిన తర్వాత ధరిస్తారు.

 Do You Know Why Married Women Wear Black Beads, Black Beads,married Women,reduci-TeluguStop.com

ఈ విధంగా ఆభరణాలను ధరించడం మన సాంప్రదాయంలో ఒక భాగం అని చెప్పవచ్చు.అయితే ఈ ఆభరణాలను ధరించడానికి ఒక్కోదానికి ఒక్కొక్క ఒక కారణం ఉంది.

అయితే ప్రస్తుతం పెళ్లైన మహిళలు మాత్రమే నల్లపూసలు ఎందుకు ధరిస్తారో ఇక్కడ తెలుసుకుందాం

పూర్వ కాలంలో పెళ్లి తర్వాత మహిళ మంగళసూత్రాన్ని నల్లపూసలలో వేసుకునే ధరించేది.పూర్వం ఈ నల్లపూసల నల్ల మట్టితో చేసేవారు.

ఈనల్ల మట్టితో తయారు చేసిన పూసలను వేసుకోవడం ద్వారా ఆ పూసలు మన చాతి పై పడటం ద్వారా మన శరీరంలో ఉన్న వేడిని తొలగిస్తుంది.ఈ విధంగా నల్లపూసలు మన శరీరంలో వేడిని తగ్గించడం ద్వారా అనేక గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.

మట్టితో తయారు చేసిన నల్లపూసల దండను వధూవరులచే నీలలోహిత గౌరీకి పూజ చేస్తారు.ఈ విధంగా పూజలు చేయటం ద్వారా ఆ గౌరీ మాత అనుగ్రహం కలిగి వారు జీవితాంతం కలిసిమెలిసి సుఖంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది.

అంతేకాకుండా వధువు నిత్యం దీర్ఘ సుమంగళీగా ఉండాలని భావించి ఈ గౌరీ వ్రతం చేస్తారు.

నీలలోహిత గౌరీ సన్నిధి నందు నల్లపూసల దండను ధరించటం వల్ల వధూవరులకు సంబంధించిన ఎటువంటి జాతక దోషాలైనా, సర్ప దోషాలైనా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు.

అందువల్ల పూర్వకాలంలో పెళ్లైన మహిళలు మంగళసూత్రాన్ని నల్లపూసలలో మాత్రమే వేసుకుని ధరించే వారు.కానీ ప్రస్తుత కాలంలో మట్టితో తయారు చేసిన నల్లపూసలు కనుమరుగైపోయాయి.

ప్రస్తుతం బంగారు షాపులలో రెడీమేడ్ పూసలు దొరుకుతున్నాయి.అంతే కాకుండా ఇప్పుడు మహిళలు మంగళ సూత్రాన్ని నల్లపూసలలో కాకుండా, బంగారు దండలో వేసుకోవడం మనం చూస్తున్నాం.

Do You Know Why Married Women Wear Black Beads, Black Beads,married Women,Reducing Body Heat,heart Problems,నల్లపూసలు - Telugu Black Beads, Heart Problems, Married

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube