శివుడుని లింగరూపంలోనే ఎందుకు పూజిస్తారో తెలుసా?

శివుడు అంటే పవిత్రమైనది అని అర్థం.హిందూ మతం యొక్క ముగ్గురు ప్రధాన దేవతలలో శివుడు ఒకరు.

 Reason Behind Worshipping Lord Shiva In The Form Of Lingam, Lord Shiva, Worshipe-TeluguStop.com

సమకాలీన హిందూమతంలో అత్యంత ప్రభావితమైన మూడు తెగలలో ఒకటైన షైవిజంలో శివుడిని ప్రధాన దేవునిగా ఆరాధించారు.అయితే దేశ వ్యాప్తంగా ఎన్నో శివ మందిరాలు ఉన్నాయి.

అన్ని శివ మందిరంలోనే శివుడిని విగ్రహరూపంలో కాకుండా లింగరూపంలోనే పూజిస్తారు.శివుని ముల్లోకాలకు ఆ దేవునిగా భావిస్తారు.

సింధు నాగరికత కాలంలోనే శివుని లింగ రూపంలో పూజించేవారు.అయితే శివుని లింగ రూపంలో ఎందుకు పూజిస్తారు అనేది ఇక్కడ తెలుసుకుందాం.

హిందూమతంలో శివుణ్ణి ఆరాధించే అత్యంత ప్రాచుర్యం లింగరూపం లోనే ఉంది.దీనినే శివలింగం అంటారు.అయితే పూర్వం శివుని విగ్రహం రూపంలోనే పూజించేవారు.ప్రస్తుతం లింగరూపంలో పూజించడానికి ఒక కారణం ఉంది.

వరాహ పురాణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన ఈ కథలో బృగు మహర్షి శివుని కలవడానికి వస్తాడు.శివుడు తాండవం చేస్తూ భృగుమహర్షినీ గమనించడు.

దీనితో ఆ మహర్షి ఆగ్రహం చెంది.ఇప్పటినుంచి నీ శివలింగానికి మాత్రమే కానీ విగ్రహానికి పూజలు ఉండవు అని శపిస్తాడు.అందువల్ల శివుని లింగ రూపంలో మాత్రమే పూజిస్తారు.

శివలింగ భాగాలు:

శివలింగంలో మూడు భాగాలు ఉంటాయి.

1.బ్రహ్మ పీఠ + వృత్తాకార ఆధారం

2.

విష్ణు పీఠ + మధ్యలో గిన్నె లాంటి ఆకారం

3 శివ పీఠ + గుండె నేతలతో పైభాగంలో ఉన్న స్థూపాకార స్థంభం.

వీటిలో ప్రతి ఒక్కటీ హిందూ దేవుళ్ళలో త్రిమూర్తులను సూచిస్తుంది.

బ్రహ్మ( సృష్టికర్త), విష్ణువు( సంరక్షకుడు), శివుడు( నాశనం చేసేవాడు) కాబట్టి లింగం మూడు దేవతలకు ప్రతీక.లింగాలలో అత్యంత పవిత్రమైనవి జ్యోతిర్లింగాలు వాటిలో పన్నెండు ఉన్నాయి.జ్యోతిర్లింగాలు శివుని భక్తి ప్రాతినిధ్యం.జ్యోతి అంటే కాంతి, లింగ అంటే గుర్తు.కాబట్టి జ్యోతిర్లింగ అంటే శివుని యొక్క ప్రకాశవంతమైన సంకేతమని అర్థం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube