నిర్మాణ ద‌శ‌లో ఉన్న బిల్డింగుల‌ను గ్రీన్‌ క్లాత్‌తోనే ఎందుకు క‌ప్పుతారో తెలుసా?

ప్ర‌స్తుతం అన్నిచోట్లా భవన నిర్మాణాలు, పరిశ్రమల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి.నగరాల్లో ఎత్త‌యిన‌ భవనాల నిర్మాణం రోజురోజుకూ పెరిగిపోతోంది.

 Do You Know Why Buildings Under Construction Are Covered With Green Cloth-TeluguStop.com

నిర్మాణ స్థ‌లాల్లో ప‌లు యంత్రాలు, ఇసుక లాంటి మెటీరియ‌ల్‌ క‌నిపిస్తుంది.వాటి సహాయంతో నిర్మాణ ప‌నులు జ‌రుగుతుంటాయి.

నిర్మాణంలో ఉన్న భ‌వ‌నాన్ని గ్రీన్ క్లాత్‌తో క‌ప్పి ఉంచ‌డాన్ని చూసేవుంటాం.దీని వెనుక కారణం మ‌న‌లో చాలామందికి తెలియదు.

అందుకే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.భవనాన్ని ఆకుపచ్చ రంగుతో కప్పివుంచ‌డం వెనుక లాజిక్ ఏమిటంటే.

అలా చేయడం ద్వారా నిర్మాణ స్థలంలో పనిచేసే కార్మికులు దృష్టి అటునిటు మ‌ర‌ల‌దు.చాల‌మంది కార్మికులు ఎత్త‌యిన‌ ప్రదేశాలలో పనిచేయడానికి భయపడతారు.

అటువంటి స‌మ‌యంలో వారి మనస్సు చెదిరిపోకుండా ఉండేందుకు ఆకుప‌చ్చ‌రంగు క్లాత్ వినియోగిస్తారు.ఆకుపచ్చని క్లాత్‌తో నిర్మిస్తున్న భవనాన్ని కప్పి ఉంచడం వల్ల దుమ్ము, మట్టి గాలిలో ఎగరకుండా అక్కడే ఉంటాయి.

అయితే ఇప్పటికీ మీ మదిలో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది.తెలుపు, నలుపు లేదా మరేదైనా రంగులతో ఎందుకు కప్పకూడద‌ని ప్ర‌శ్నిస్తారు.

దీనికి కార‌ణం తెలుపు, నలుపు లేదా ఇతర రంగుల కంటే ఆకుపచ్చ రంగు ఎక్కువ దూరం నుంచి కూడా కనిపిస్తుంది.ఇంతేకాకుండా రాత్రిపూట గ్రీన్ క‌ల‌ర్ ప్ర‌కాశవంతంగా క‌నిపిస్తుంది.

భవన నిర్మాణాన్ని ఆకుపచ్చ క్లాత్‌తో కప్పివుంచ‌డానికి ఇదే ప్ర‌ధాన కార‌ణం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube