బతకమ్మ బతకమ్మ ఉయ్యాలోబంగారు బతుకమ్మ ఉయ్యాలోనానోము పండింది ఉయ్యాలోనీనోము పండిందా ఉయ్యాలోమావారు వచ్చిరి ఉయ్యాలోమీవారు వచ్చిరా ఉయ్యాలో
ఊరూరా.వాడవాడలా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి.ఆడపడుచులు మెట్టినింటి నిండి పుట్టింటికి చేరుకుని ,రకరకాల పూలను త్రికోణాకారంలో పేర్చి బతుకమ్మను చేసి దాని చుట్టూ పాటలు పాడుకుంటూ ,ఆటలు ఆడుతూ సంబరాలు చేసుకోవడం స్టార్టయింది.దసరాకి తొమ్మిది రోజుల ముందు ఎంగిలి పూవు బతుకమ్మ దగ్గరినుండి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు ప్రతి ఇంట్లో ప్రతిరోజు సంబరమే .తెలంగాణా ప్రాంతానికి మాత్రమే చెందిన ఈ పండుగ ఉత్సాహం అంతా ఇంతా కాదు చిన్న,పెద్దా ముసలి ముతక అందరూ ఎంజాయ్ చేసే పండుగ.
మగవాళ్లంతా గూనుగు పువ్వు తంగేడు పువ్వు రకరకాల పువ్వులు సేకరించి తెస్తే.ఆడవాళ్లు ముస్తాబు అయి.బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి.సాయంత్రం ఒక చోట చేరి బతుకమ్మ ఆట ఆడిన తర్వాత బతుకమ్మను నీళ్లల్లో పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా అంటూ వదిలేస్తారు.ఇలా వదిలేయడం వెనుక ఒక ఉపయోగం ఉంది.
వర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభంలో వచ్చే బతుకమ్మ పండుగ సమయానికి నదులు,వాగులు నిండి ఉంటాయి.బతుకమ్మకొరకు వాడే గునుగు పువ్వు,తంగేడు పూవులకు నీటిని శుధ్ది చేసే గుణం ఉంటుంది.
కాబట్టి పర్యావరణానికి కూడా తోడ్పడుతుంది.
.