రావణుడు హిందూ పురాణాలలో లంక యొక్క పౌరాణిక బహుళ తలల రాక్షసుడు.రావణాసురుడికి పది తలలు, 20 చేతులను కలిగి తాను కోరుకున్న ఏ రూపంలో కైనా మారవచ్చు.రావణుడు ఎంతో శక్తివంతమైన ధైర్యం కలిగిన రాక్షసుడు.శివుడి మీద అపారమైన భక్తి కలిగి తపస్సు చేసి సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని మెప్పించి రావణాసురుడు శివుని ద్వారా గొప్ప వరం పొందుతాడు.
తన చెల్లెలు సూర్పణక మాటలు విని, సీతాదేవిని అపహరించి, శ్రీరాముడి చేతిలో మరణిస్తాడు.ఇంతటి గొప్ప శాలి అయిన రావణాసురుడిని, రాముడికంటే ముందే ఒక రాజు గోరాతి గోరంగా ఓడించాడు.
కానీ ఆ రాజు మనకు ఎవరికీ తెలియదు రావణాసురుడిని పెద్ద యుద్ధంలో ఓడించిన ఆ రాజు పేరు మందాత.బృగు మహర్షి దాచి ఉన్న మంత్ర జలాన్ని స్వీకరించి నందుకు యవనాశ్వుడుని భార్యకు మందాత జన్మిస్తాడు.
మందాత చిన్నతనం నుంచి విద్యాభ్యాసంలో ఎంతో మేటి సాహసాలు చేయడం, యుద్ధాలలో పోరాటాలను ఆసక్తిగా చూడడం వంటి వాటి మీద శ్రద్ధ వహించే వాడు.మందాత ఎంతటి బలశాలి అంటే తన 12 వ సంవత్సరం రాజ పట్టాభిషిక్తుడు అవుతాడు.
మందాత పరాక్రమం గురించి తెలుసుకున్న రావణాసురుడు ఎలాగైనా అతనిని ఓడించాలని, నిర్ణయించుకుంటాడు.అయితే ఈ విషయం తెలుసుకున్న మందాత రావణాసురుడితో యుద్ధానికి అంగీకరిస్తాడు.
వారిద్దరి మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా మందాతని ఓడించాలని రావణాసురుడు ముందుగా ఏర్పాటు చేసుకున్న పథకాలను అవలంబిస్తారు.రావణాసురుడు ఎన్ని పథకాలు వేసిన, మందాతని ఓడించలేక పోతాడు.
అయినప్పటికీ మందాత ని ఓడించాలన్న ఉద్దేశంతో తన ఓటమిని అంగీకరించకుండా పోరాడుతూనే ఉన్నాడు.కానీ చివరకు మందాత చేతిలో రావణాసురుడు ఓటమిని చవిచూశాడు.
ఇంతలో వీరిరువురి మధ్య బ్రహ్మ, ఇంద్రుడు జోక్యం చేసుకుని సంధి కుదుర్చుతారు.ఇద్దరూ ఒక్కటై, రావణాసురుడు తిరిగి లంక చేరుకుంటాడు.