విజయ్ దేవరకొండతో ఉన్న ఈ అబ్బాయి ఎవరో తెలుసా.. వీళ్ళ వీడియో చూస్తే నవ్వు ఆగదు!

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈయన ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.

 Do You Know Who This Boy With Vijay Devarakonda Is Details,  Vijay Devarakonda,-TeluguStop.com

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఈ సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.

ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా సక్సెస్ లతో పాటు ఫ్లాపులను కూడా ఎదుర్కొన్నాడు.

ఇక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందుతుండగా.

ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి భారీ అంచనాలే వెలువడుతున్నాయి.ఇక ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో విడుదల కానుంది.

ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి ఫేమ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.ఈయన సినిమాలకు ఎదురు చూసే అభిమానులు కూడా ఉన్నారు.

అంతే కాకుండా విజయ్ కు చిన్న పిల్లల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.నిజానికి చిన్న పిల్లలకు వీరాభిమాని అనే చెప్పాలి.

Telugu Liger, Naithik, Puri Jagannath, Sukumar, Tollywood, Young Boy-Movie

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.అందులో విజయ్ దేవరకొండ వీర అభిమాని అని ఒక పిల్లోడు బాగా హల్ చల్ చేశాడు.గతంలో ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చదువుకునే ఓ అబ్బాయి దగ్గరికి యాంకర్ వెళ్ళాడు.ఇక అబ్బాయి తన పేరు నైతిక్ అని చెప్పాడు.

Telugu Liger, Naithik, Puri Jagannath, Sukumar, Tollywood, Young Boy-Movie

ఇక ఆ అబ్బాయికి వెనకాల జుట్టు బాగా ఉంది.దానిని ఒక పిలక లాగా వేసుకున్నాడు.అది తన కోసం కాదని విజయ్ దేవరకొండ కోసమని చెప్పకనే చెప్పాడు ఆ చిన్న వీర అభిమాని.ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం జుట్టు పెంచుకోవడంతో ఆ అబ్బాయి కూడా విజయ్ కోసం, ఆయన మీద ఉన్న అభిమానం కోసం పెంచుకున్నాడు.

ఇక ఆ యాంకర్ ఇలా జుట్టు పెంచుకుంటే స్కూల్ లో ఏం అనడం లేదా అనే సరికి ఆన్ లైన్ క్లాస్ అని అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

ఆ తర్వాత ఆ అబ్బాయిని విజయ్ దేవరకొండ దగ్గరికి పంపించగా.

విజయ్ కు కూడా అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.తన తర్వాత సినిమాకు తాను గుండు చేయించుకుంటానని నువ్వు కూడా చేయించుకుంటావా అని అడగడంతో.

లైగర్ సినిమా తరువాత చేయించుకుంటానని సమాధానం ఇచ్చాడు.

Telugu Liger, Naithik, Puri Jagannath, Sukumar, Tollywood, Young Boy-Movie

దీంతో విజయ్ దేవరకొండ ఆ బుడ్డోడు మాటలకు ఫిదా అయ్యాడు.తన తర్వాత సినిమాకు తన హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే ఆ బుడ్డోడికి కూడా చేయిస్తానని మాట ఇచ్చాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియో చూసిన వాళ్ళు తెగ నవ్వుకుంటున్నారు.ఇక లైగర్ తర్వాత విజయ్.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.ఈ సినిమాకు ‘రాంపేజ్’ అనే పేరు కూడా ఫిక్స్ చేశారట సినీ బృందం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube