ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా..

భారతదేశంలో అత్యంత ధనవంతులైన క్రికెటర్స్ ఎవరు అని అడిగితే ముందుగా ధోని, సచిన్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్ల పేర్లు వినిపిస్తాయి.కానీ వాళ్ళందరి కంటే అత్యంత సంపన్నమైన క్రికెటర్ మరొకరు ఉన్నారు అంటే నమ్ముతారా? ఆ సంపన్న క్రికెటర్ కి కేవలం 23 సంవత్సరాలని ఇప్పటివరకు క్రీడారంగంలో ఎటువంటి పేరుప్రఖ్యాతలు కూడా సంపాదించలేదన.చెబితే నమ్ముతారా? కానీ ఆ నవ యువ క్రికెటర్ అత్యంత సంపన్నమైన క్రికెటర్ గా నిలుస్తూ అన్ని రికార్డులను తిరగరాస్తున్నారు.ఇంతకీ అతను ఎవరు అని ఆలోచిస్తున్నారా? ప్రముఖ వ్యాపార దిగ్గజం కుమార్ మంగళం బిర్లా తెలుసుకదా అతడి కుమారుడు ఆర్యమన్ బిల్లా కి క్రికెట్ అంటే మహా ఇష్టం.ప్రస్తుతం అతడు మధ్యప్రదేశ్ జట్టు తరుపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నారు.అయితే అతడి ఆస్తి విలువ అక్షరాల 70 వేల కోట్లు.దీంతో అతడు క్రికెటర్లందరిలో అత్యంత సంపన్నుడిగా పేరుపొందారు.

 Do You Know Who Is The Richest Cricketer In India ..! Cricketer, Richest Crickte-TeluguStop.com

Telugu @aryamanbirla, Aryaman Birla, Cricketer, Latest-Latest News - Telugu

అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగాలన్నదే తన లక్ష్యమని ఆర్యమన్ బిర్లా చెబుతుంటారు.ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ అయిన ఇతడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో నెంబర్ వన్ స్టార్ క్రికెటర్ కావాలనే ఆశయంతో కఠినమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.తన ఇంటి పేరు, తన తండ్రి పేరు ఎక్కడ కూడా వాడుకోకుండా తన సొంత శక్తితో తనకంటూ ఒక మంచి గుర్తింపు దక్కించుకోవాలని తాను తపన పడుతున్నట్టు బిర్లా చెబుతున్నారు.

లెఫ్ట్ ఆర్మ్ ఆర్థో డాక్స్ బౌలింగ్ కూడా ఆయన నేర్చుకున్నారు.దీంతో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో బాగా ట్రైనింగ్ పుచ్చుకొని ఆల్రౌండర్ క్రికెటర్ గా క్రీడా రంగ ప్రవేశం చేశారు.

2017 సంవత్సరంలో ఇండోర్ లో మధ్యప్రదేశ్ తరపున ఆడే ఒడిశా జట్టుపై 22 పరుగులు చేశారు.అయితే తనకు ఆ మ్యాచ్ చాలా అనుభవాన్ని నేర్పించింది అని బిర్లా చెబుతుంటారు.

సీకే నాయుడు ట్రోఫీలో 11 మ్యాచుల్లో 795 పరుగులు సాధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube