నువ్వే కావాలి సినిమా ని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా...?

Do You Know Who Is The Hero Who Missed The Movie Nuvve Kavali Movie, Tarun , Sumanth , Nuvve Kavali , Tollywood, Ravi Kishore , Roja Ramani

నువ్వే కావాలి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే ఈ సినిమా లో తరుణ్ హీరో గా రిచా హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటల రచయిత గా పని చేసారు.

అయితే ఈ సినిమా లో హీరో గా తరుణ్ కంటే ముందే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినా స్రవంతి రవి కిషోర్ గారు సుమంత్ ని హీరో గా తీసుకుందాం అనుకోని ఆయన్ని అడిగితే ఆయన వేరే సినిమాల్లో బిజీ గా ఉండి ఈ సినిమా చేయలేకపోయారు దాంతో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తరుణ్ హీరోగా సినిమాలు చేయబోతున్నాడు అని తెలుసుకున్న రవి కిషోర్ తరుణ్ వాళ్ల అమ్మ అయినా రోజా రమణి గారిని కలిసి ఆమె కి కథ చెప్పారు ఆమెకి కథ బాగా నచ్చింది దాంతో తరుణ్ కి ఈ సినిమా బాగా సెట్ అవుతుందని ఆమె అనుకొని ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారు దాంతో తరుణ్ ని హీరో గా పెట్టి ఈ సినిమా తీశారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఓవర్ నైట్ లో తరుణ్ స్టార్ హీరో అయిపోయాడు.

Telugu Nuvve Kavali, Ravi Kishore, Roja Ramani, Sumanth, Tarun, Tollywood-Telugu

ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా చేసిన తరుణ్ వరుసగా ప్రియమైన నీకు, నువ్వే నువ్వే సినిమా లతో మంచి హిట్స్ అందుకొని యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు దింతో ఆయన క్రేజ్ విపరీతం గా పెరిగిపోయింది ఆ తర్వాత సినిమా ల ఎంపిక లో సరైన జడ్జిమెంట్ లేకపోవడం వల్ల వరుసగా ప్లాప్ లు వచ్చాయి దాంతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయారు…ఇక తరుణ్ పరిస్థితి ఇలా ఉంటె సుమంత్ కెరియర్ స్టార్టింగ్ నుంచే చాలా డల్ గా సాగింది ఎన్ని సినిమాలు చేసిన ఒకటి రెండు మినహా పెద్దగా సక్సెస్ లు రాకపోవడంతో ఆయనకి భారీ ఆఫర్స్ ఏం రాలేదు ఇప్పటికీ తాను సినిమాలు చేస్తున్న సక్సెస్లు మాత్రం పడడం లేదనే చెప్పాలి…ఒక వేళా అప్పుడు కనక నువ్వే కావాలి లాంటి సినిమా సుమంత్ కి పడి ఉంటె మంచి హీరో అయ్యేవాడు అలా ఒక మంచి హిట్ సినిమా ని మిస్ చేసుకున్నాడు.

Telugu Nuvve Kavali, Ravi Kishore, Roja Ramani, Sumanth, Tarun, Tollywood-Telugu

అందుకే ఇండస్ట్రీ లో జడ్జిమెంట్ అనేది చాలా ముఖ్యం అప్పుడున్న ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ని బట్టి ఆ టైం లో వాళ్ళకి ఏ సినిమాలు అయితే నచ్చుతున్నాయి అని తెలుసుకొని సినిమాలు చేయడం చాలా ముఖ్యం.ఒక్క సినిమానే మిస్ అయింది కదా అనుకుంటాం కానీ ఆ ఒక్క సినిమా సక్సెస్ తోనే సినిమా హీరో కెరియర్ అనేది ముడి పడి ఉంటుంది…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube