శృతిహాసన్ ఫేవరెట్ కోస్టార్ ఎవరో తెలుసా.. అతనే బెస్ట్ అంటూ కాంప్లిమెంట్?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒక సమయంలో ఈమె కెరియర్ పూర్తిగా డౌన్ అయినప్పటికీ క్రాక్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చారు.

 Do You Know Who Is Shruti Haasan Favorite Costar , Shruti Haasan , Tollywood, Fa-TeluguStop.com

ఇలా క్రాక్ సినిమాతో మంచి హిట్ కొట్టిన శృతిహాసన్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులో ఉన్నారు.

ఈ క్రమంలోని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తన ఫేవరెట్ కోస్టార్ గురించి వెల్లడించారు.

శృతిహాసన్ ప్రభాస్ తో మాత్రమే కాకుండా బాలకృష్ణ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా నటిస్తున్నారు.

అయితే వీరిద్దరూ పెద్ద సెలెబ్రెటీలు కావడంతో వీరితో శృతిహాసన్ చనువుగా ఉండలేకపోతున్నారు.అయితే సలార్ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభాస్ గురించి ఎన్నోసార్లు శృతిహాసన్ ఎంతో గొప్పగా చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఈమె తన ఫేవరెట్ కోస్టార్ గురించి తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

Telugu Balakrishna, Chiranjeevi, Favorite, Kamal Haasan, Prabhas, Salaar, Shruti

ఇప్పటివరకు తాను పనిచేసిన హీరోలలో తన ఫేవరెట్ కోస్టార్ ప్రభాస్ అని ఈ సందర్భంగా శృతిహాసన్ వెల్లడించారు.షూటింగ్ లొకేషన్లో ప్రభాస్ అందరిని రిసీవ్ చేసుకునే విధానం, ఆయన లొకేషన్ లో ఉన్నవారికి ఫుడ్ తీసుకురావడం,అందరితోనూ ఎంతో చనువుగా మూవ్ అవ్వడం తనకు ఎంతగానో నచ్చుతాయని అతనికి బాహుబలి రేంజ్ ఉన్నప్పటికీ ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతారని అందుకే తన ఫేవరెట్ కోస్టార్ అయ్యారని ఈ సందర్భంగా శృతిహాసన్ ప్రభాస్ గురించి ఎంతో గొప్పగా ఆయనపై ప్రశంసలు కురిపించారు.ప్రస్తుతం శృతి ప్రభాస్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube