అష్ట దిక్పాలకులు అంటే ఎవరో మీకు తెలుసా?

సాధారణంగా మన ఇంట్లో ఏదైనా వ్రతాలు, హోమాలు నిర్వహించేటప్పుడు పంతులు అష్టదిక్పాలకులు అన్న మాట వినే ఉంటారు.అసలు ఈ అష్టదిక్పాలకులు అంటే ఎవరు? వారిని ఏ విధంగా పూజించాలి? వారిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతుంటాయి.మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు నాలుగు ప్రధాన దిక్కులు ఉంటాయి.ఈ దిక్కులతో పాటు నాలుగు దిక్కుల మూలలకు ఒక్కొక్క మూలకు ఒక్కొక్క దేవుడు కాపలా ఉంటారు.

 Astadikpalakas History, Ashta Dikpalakas, Kuberudu, Varuna Devudu, Shiva, Indra-TeluguStop.com

ఈ ఎనిమిది దిక్కులకు కాపలా ఉండే దేవతలని అష్టదిక్పాలకులు అని పిలుస్తారు.

ఈ ఎనిమిది దిక్కులలో ఒక్కో దిక్కులో ఒక దేవుడి తో పాటు వారి భార్యలు కొలువై ఉంటారు ఏ దిక్కున ఏ దేవతలు కొలువై ఉంటారు ఇక్కడ తెలుసుకుందాం.

తూర్పు దిక్కు అధిపతి ఇంద్ర దేవుడు అతని సతీమణి శనిదేవి కొలువై ఉంటారు.తూర్పు దిక్కున ఇంద్ర దేవుడు పాలిస్తూ ఉంటాడు.ఇంద్ర దేవుని పూజించడం వల్ల సంతానం, ఐశ్వర్యం కలుగుతుంది.

పడమర దిక్కున వరుణ దేవుడు ఆయన భార్య కాళికాదేవి కొలువై ఉంటారు.

పడమర దిక్కున వరుణదేవుడు కొలువై ఉండడం వల్ల మన ఇంటి నిర్మాణం కొద్దిగా ఎత్తులో ఉండడం లేదా నీటి నిల్వ ఉంచుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ఉత్తర దిక్కున కుబేరుడు ఆయన సతీమణి చిత్రరేఖ దేవి కొలువై ఉంటారు.

కుబేరుడు సంపదకు కారకుడు కాబట్టి,మన ఇంటిలో ఉత్తర దిక్కున కుబేరుడు విగ్రహం పెట్టుకోవడం వల్ల సిరి సంపదలు వెల్లివిరుస్తాయి.దక్షిణాన యమధర్మరాజు ఆయన సతీమణి శ్యామలాదేవి కొలువై ఉంటారు.

ఈశాన్య దిక్కులో పరమేశ్వరుడు, పార్వతీ దేవి కొలువై ఉంటారు.శివుని జలంధరుడు అని కూడా పిలుస్తారు కాబట్టిఈశాన్య దిక్కులో నీటిని ఉంచడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు అతని భార్య స్వాహాదేవి కొలువై ఉంటారు.అందువల్ల మన ఇంట్లో ఆగ్నేయములో వంట చేసుకోవడానికి సరైన దిశగా భావిస్తారు.

వాయువ్య మూలానికి వాయు దేవుడు అతని భార్య అంజనా దేవి కొలువై ఉంటారు.నైరుతికి అధిష్టాన దేవుడిగా నివృత్తి అనే రాక్షసుడు ఆయన భార్య వివిధ దేవి కొలువై ఉంటారు.

ఇలా అష్ట దిక్కులలో దేవతలు కాపలా ఉండి పూజించడం మన హిందూ సంప్రదాయంలో మాత్రమే పాటిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube