ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిచిన టీమ్ ఏదో తెలుసా?

ఐపీఎల్.ప్రపంచంలోనే అత్యంత డబ్బుతో కూడుకున్న క్రికెట్ లీగ్.

 Do You Know Which Team Won More Matches In Ipl-TeluguStop.com

బీసీసీఐ ఆధ్వర్యంలో నడిచే ఈ లీగ్ లో ఆడేందుకు ప్రపంచ మేటి క్రికెటర్లు అందరూ ఎంతో ఎదురు చూస్తారు.ఒక్కసారి ఈ లీగ్ కు ఎంపిక అయితే డబ్బుల మూటలు పట్టుకెళ్లొచ్చు అనుకుంటారు పలువురు ఆటగాళ్లు.

అంతేకాదు.పలువురు యువ ఆటగాళ్లకు కల్పతరువు ఐపీఎల్.

 Do You Know Which Team Won More Matches In Ipl-ఐపీఎల్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిచిన టీమ్ ఏదో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటి వరకు ధూంధాంగా కొనసాగిన ఐపీఎల్ మాత్రం.పొయిన సారి మాత్రం తూతూ మంత్రంగా సాగింది.

కరోనా వేళ ప్రేక్షకులు లేకుండానే కేవలం టీవీల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా మ్యాచ్ లు నిర్వహించారు.

ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మ్యాచ్ లు నిర్వహించినా.

పలువురు క్రికెటర్లకు కరోనా సోకింది.అంతేకాదు పలవురు సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు.

దీంతో ఐపీఎల్ ను అర్థాంతరంగా వాయిదా వేశారు.తాజాగా మళ్లీ ఈ లీగ్ నిర్వహణకు అడుగులు పడుతున్నాయి.

అయితే ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలో ఎక్కువ మ్యాచ్ లు ఏ జట్టు గెలిచింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ మ్యాచ్ లు గెలిన టీమ్ గా ముంబై ఇండియన్స్ రికార్డు సాధించింది.

ఎక్కువ మ్యాచ్ లు గెలవడమే కాదు.ఎక్కువసార్లు టైటిల్ గెలిచిన టీమ్ గా కూడా ముంబై ఇండియన్సే నిలిచింది.

ఇంతకీ ఐపీఎల్ లో ఏ టీమ్ ఎన్నిసార్లే విజయం సాధించింది? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఇప్ప‌టి వ‌ర‌కు IPL లో MI-122 మ్యాచ్ లు గెలిచింది.CSK -111 సార్లు విజయం సాధించింది.KKR-100 సార్లు గెలవగా RCB-94 సార్లు విజయాన్ని అందుకుంది. DC-89 సార్లు గెలిచింది.PANJAB -88 సార్లు విజయాన్ని అందుకుంది. RAJASTHAN- 82 విజయం సాధించగా.HYD-66 సార్లు జయకేతనం ఎగుర వేసింది.మొత్తంగా ఎక్కువ మ్యాచ్ లు గెలవడంలో గానీ.ఎక్కువ సార్లు టైటిల్ విజేతగా నిలవడంలో గానీ ముంబై ఇండియన్స్ రికార్డు కొట్టింది అని చెప్పుకోవచ్చు.

#BCCI #Cricket League #Ipl Matches #Mumbai Indians #Matches Ipl

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు