చిరంజీవి కన్నా ముందుగా గాడ్ ఫాదర్ టైటిల్ తో సందడి చేసిన హీరో ఎవరో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు నటించిన సినిమా పేర్లను కొంతకాలానికి మరికొంతమంది హీరోలు తమ సినిమాలకు ఉపయోగించుకోవడం మనం చూస్తున్నాము.ఇలా ఒకే టైటిల్ తో రెండు మూడు సినిమాలు వచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.

 Do You Know Which Hero Made Noise With The Title Of Godfather Before Chiranjeevi-TeluguStop.com

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో సినిమా టైటిల్స్ కూడా ఇదివరకే ఇతర హీరోలు నటించిన సినిమా టైటిల్స్ ను తన సినిమాలకు పెట్టుకున్నారు.ఇకపోతే తాజాగా ఈయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా టైటిల్ తో ఇదివరకే ఓ సీనియర్ హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా చిరు కన్న ముందుగా ప్రేక్షకులను సందడి చేసిన ఆ హీరో ఎవరు ఆ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంది అనే విషయానికి వస్తే… సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు,వినోద్ కుమార్ హీరోలుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే టైటిల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.

అయితే ఇదే టైటిల్ తోనే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ చిత్రాన్ని మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

మలయాళంలో ఎంతో విజయాన్ని సొంతం చేసుకున్న లూసిఫర్ సినిమా తెలుగులో కూడా గాడ్ ఫాదర్ పేరిట మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube