గులాబ్‌జామ్‌ను మొదటగా ఏ దేశస్థులు తయారు చేశారో తెలుసా..!

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్వీట్లను ఇష్టపడుతుంటారు.ప్రతి శుభకార్యంలో స్వీట్ తినడం, తినిపించడం ఆనవాయితీగా వస్తోంది.

 Do You Know Which Country Made Gulab Jam First  Gulab Jamun, Sweet,  Recipi, Pre-TeluguStop.com

స్వీట్ అంటే తీపి పదార్థమే కానీ ఇందులోనూ రకరకాల రుచులతో వేలాది స్వీట్స్ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.లడ్డు, బాదుషా, కాజా, కజ్జికాయ, కలాకండ్, రసగుల్ల, మైసూర్ పాక్, డబల్ కా మీఠా, సోన్ పాపిడి, జిలేబి, అరిసెలు ఇలా ఎన్నో రకాల సీట్లను భారతీయుడు హాయిగా లాగించేస్తున్నారు.

ఇక ఈ రోజుల్లో రెడీమేడ్ గులాబ్‌జామ్‌ మిక్స్ తో ప్రతి ఇంట్లో గులాబ్‌జామ్‌ స్వీట్స్ ఈజీగా చేసుకుంటున్నారు.

నిజానికి గులాబ్ జామ్ చాలామందికి ఫేవరెట్ స్వీట్.

నోట్లో వేసుకోగానే కరిగిపోయే అత్యంత రుచికరమైన గులాబ్‌జామ్‌ను మొదటిగా తయారుచేసింది భారతీయులే అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.దీనిని తొలిసారిగా పర్షియన్ వంటగాడు తయారు చేశాడని చెబుతుంటారు.

పెర్షియన్ ప్రజలే మొదటగా గులాబ్‌జామ్‌ అనే పేరు పెట్టారని అంటుంటారు.గుల్ అంటే పర్షియా భాషలో ఫ్లవర్ అని అర్థం.

ఆబ్ అంటే తీపి నీరు అని అర్థం.ఈ రెండు పదాలను కలిపితే పర్షియా భాషలో రోజ్ ఫ్లవర్ కలిగిన తీయటి సిరప్ అని అర్థం వస్తుంది.

మన ఇండియాలో హిందీలో జామున్ అంటే నేరేడు పండు అని అర్థం.ఆ విధంగా గులాబ్‌జామ్‌కు పేరు వచ్చింది.

Telugu Gulab Jamun, Iran, Latest, Prepared, Recipi, Sweet-Latest News - Telugu

పూర్వకాలంలో ఇరాన్‌ దేశంలో తొలిసారిగా గులాబ్ జామ్‌ తయారచేశారని చరిత్ర ప్రకారం తెలుస్తోంది.టర్కిష్ ప్రజలు దీనిని భారతీయులకు పరిచయం చేశారని చెబుతుంటారు.ప్రస్తుతం మన ఇండియాలోనే కాదు అరబ్ దేశాల్లో కూడా గులాబ్ జామ్‌ బాగా ప్రసిద్ధి చెందింది.కాకపోతే వాటిని వేరే పేర్లతో కాస్త వెరైటీగా చేస్తుంటారు.ఈ స్వీట్ ని పశ్చిమ బెంగాల్‌లో పాంటువా, గోలప్ జామ్, కలో జామ్ అని కూడా పిలుస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube