ఓలా, ఉబెర్, రేపిడోలో న‌మోదైన మీ వివ‌రాలు ఎక్క‌డికి వెళ‌తాయో తెలుసా?

మీరు ఎక్కడికైనా వెళ్లిన‌ప్పుడు ఉబెర్ , ఓలా లేదా రాపిడో సంస్థ‌ల‌ సేవలను తప్పనిసరిగా ఉపయోగించేవుంటారు.అటువంట‌ప్పుడు మీరందించే మీ వ్యక్తిగత సమాచారాన్ని ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయో మీకు తెలుసా ? మీ వ్యక్తిగత సమాచారాన్ని ఈ కంపెనీలు థ‌ర్డ్ పార్టీకి విక్రయిస్తాయ‌ని ఒక అధ్య‌య‌నంలో తేలింది.సర్ఫ్‌షార్క్ సీఈవో వ్య‌త్యూసా క‌జియుకొనోయిస్ నిర్వ‌హించిన ఈ అధ్యయనంలో 30 రైడ్ హెయిలింగ్ యాప్‌లలో, 9 కంపెనీలు మూడవ పార్టీ ప్రకటనల కోసం వినియోగదారు సమాచారాన్ని విక్రయిస్తున్నట్లు తేలింది.

 Do You Know Where Your Details Registered In Ola Uber Rapido Go Third Party Sa-TeluguStop.com

వీటిలో వినియోగదారుల పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఈమెయిల్ మొదలైనవి ఉంటాయి.

వినియోగ‌దారులు ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినప్పుడు, డేటా షేరింగ్‌కు సంబంధించి మొదట్లో వారి నుంచి అనుమతి తీసుకుంటాయ‌ని సర్ఫ్‌షార్క్ సీఈఓ చెప్పారు.యాప్ మీ డేటాలో దేనిని చదవవచ్చు లేదా ఉపయోగించవచ్చనే దానిపై ముందుగా అనుమతి తీసుకుంటుంది.

సౌలభ్యం కారణంగా మీరు హెచ్చరికను చదవకుండా, యాప్‌లను ఇన్‌స్టార్ చేయ‌డానికి మీ వ్యక్తిగత డేటాను కూడా అనుమతిస్తూ ఓకే చేస్తూ ఉంటారు.ప్రతిదానికీ అనుమతి ఇవ్వకుండా మీరు వారితో లొకేషన్‌ను మాత్రమే షేర్ చేయాల‌ని ఆయ‌న సూచించారు.

అలాగే ఇంటర్నెట్ యాక్సెస్‌ని అనుమతించాలి.అయితే మీ రీడింగ్ కాంటాక్ట్‌లు, ఫోన్ మెమరీ, స్టోరేజ్ మొదలైనవాటిలోకి అనుమ‌తివ్వ‌కూడ‌ద‌ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube