ప్రతి ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చే సంగమేశ్వరాలయం ఎక్కడుందో తెలుసా...?

Do-you-know-where The Sangameshwara Temple Is Located Which Is Isited Only Forfourmonths Everyyear Sangameshwara Temple, Kurnool, Krishna Rever, Parameshwara,srishalam

మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయం అని చెప్పవచ్చు.మన దేశంలో కొలువై ఉన్న ఎన్నో ఆలయాలు సంవత్సరంలో కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

 Do-you-know-where The Sangameshwara Temple Is Located Which Is Isited Only Forf-TeluguStop.com

ఈ విధమైనటు వంటి ఎన్నో ఆలయాలు మన దేశంలో కొలువై ఉన్నాయి.ఈ క్రమంలోనే ఏడాది పాటు కాలంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం కలిగించే శ్రీ సంగమేశ్వర ఆలయం ఒకటి అని చెప్పవచ్చు.

ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం నాలుగు నెలలు మాత్రమే దర్శనం ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని,కర్నూలు జిల్లాలో కొలువైన శ్రీ సంగమేశ్వర ఆలయం దాదాపు ఎనిమిది నెలల తర్వాత తొలిసారిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు.

గత ఏడాది జూలై 20వ తేదీన సంగమేశ్వర ఆలయం కృష్ణా నది ఒడిలో మునిగి పోయింది.మరి ఎనిమిది నెలల తర్వాత భక్తులకు దర్శనం ఇస్తోంది.ప్రస్తుతం శ్రీశైలం లోని నీటి మట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం ప్రహరి, ఆలయ ముఖ ద్వారం, ఆలయంలోని దేవతా మూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ విధంగా కృష్ణా నది నుంచి ఎనిమిది నెలల తర్వాత ఆలయం బయట కనిపించడంతో పూజారులు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.

ప్రపంచంలోని ఏడు నదులు కలిసే చోటే సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు ఒక చోట కలిసి ఈ ప్రదేశాన్ని సంగమేశ్వరం అని పిలుస్తారు.ఈ ఏడు నదులలో భవనాసి మాత్రమే పురుషుడి పేరు ఉన్నది.మిగిలిన ఆరు నదులు స్త్రీ పేరు ను కలిగి ఉన్నాయి.ఈ ఏడు నదులలో భవనాసి మాత్రమే తూర్పు నుంచి పశ్చిమ వైపు ప్రవహిస్తుంది.మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తూ, జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరిగా సముద్ర గర్భంలో కలుస్తాయి.

అదే విధంగా ఈ ఆలయంలో వేల సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన వేప లింగం ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది.ఈ విధంగా ఏడు నదులు కలిసే చోట కొలువై ఉన్న ఈ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల నరక బాధలు తొలగిపోతాయని భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.

Video : Do-you-know-where The Sangameshwara Temple Is Located Which Is Isited Only Forfourmonths Everyyear Sangameshwara Temple, Kurnool, Krishna Rever, Parameshwara,srishalam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube