చెస్ బోర్డు రూపంలో కనిపిస్తోంది ఓ రైల్వేస్టేషన్.అవును మీరు విన్నది నిజమే.
పై నుంచి చూస్తే అచ్చం చెస్ బోర్డులా కనిపించే ఈ రైల్వేస్టేషన్ లో స్టేషన్ డోమ్, పిల్లర్లు చెస్ పీసులుగా కనిపిస్తుంటాయి.అది ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూసేయండి.
ఉత్తర భారతంలో ఉన్న రైల్వేస్టేషన్ లలో ప్రధానమైనది.ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నవాబుల పట్నంగా పేరొందిన లక్నోలోని చార్ బాగ్ లో నిర్మితమైంది.చారిత్రాత్మకమైన ఈ రైల్వేస్టేషన్ అద్భుతమైన ఆర్కిటెక్చర్.వినూత్నమైన నిర్మాణ శైలితో ఎంతోమంది సందర్శకులను, టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ విషయాన్ని స్వయంగా భారతీయ రైల్వే విభాగం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
మీరు కూడా ఈ రైల్వేస్టేషన్ ను చూడాలనుకుంటున్నారా.? సోషల్ మీడియాలో ఈ చార్ బాగ్ రైల్వేస్టేషన్ నిర్మాణంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.కొందరు ఈ అద్భుతాన్ని చూసి తీరాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం టూరిస్టులు పైకి వెళ్లి ఎలా చూస్తారని ప్రశ్నిస్తున్నారు.నేలపై నుంచి చూస్తే ఏమీ కనిపించదు.
కాబట్టి తప్పనిసరిగా పై నుంచే చూడాలి అదేలా సాధ్యమనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయని తెలుస్తోంది.