41 ప్రదక్షణలతో కోరికలు తీర్చే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

Do You Know Where Is The Temple That Fulfills Desires With 41 Performances

తెలుగు రాష్ట్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ పట్టణం పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అక్కడ వెలిసినటువంటి వేయి స్తంభాల గుడి.ఈ ఆలయంలో రుద్రేశ్వర స్వామి వారు కొలువై ఉండి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.

 Do You Know Where Is The Temple That Fulfills Desires With 41 Performances-TeluguStop.com

తూర్పు అభిముఖంగా ఉన్న ఈ ఆలయానికి సుమారు 820 సంవత్సరాల చరిత్ర కలిగినదిగా అక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి.ఈ ఆలయంలోనికి ప్రవేశించగానే మధ్యలో ఓ మంటపంలో ఆ పరమేశ్వరుడు రుద్రేశ్వరుడుగా కొలువై ఉండి భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు.

అతి పురాతనమైన ఈ ఆలయంలో అత్యంత పెద్దదైన శివలింగంగా రుద్రేశ్వరుడు పూజలందుకుంటున్నాడు.ఆలయ ప్రాంగణంలోనే కన్యకాపరమేశ్వరి ఆలయం, ఆంజనేయ, వీరభద్ర, నవగ్రహాలు కూడా మనకు దర్శనం కల్పిస్తాయి.క్రీ.శ1194 రుద్రదేవుడు పాలన చేస్తున్న సమయంలో కాకతీయ కొలువులో పనిచేస్తున్న 30 మంది సైనికులు ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది.తిరిగి 2006వ సంవత్సరంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది.తమిళనాడు నుంచి ఎంతో నైపుణ్యం గల శిల్పులను పిలిపించి ఆలయ నిర్మాణం చేపట్టారు.ఇది పూర్తి కావడానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది 2012 ఫిబ్రవరి 12న ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది.కాకతీయుల శివలింగాన్నే పునఃప్రతిష్ఠించారు.

 Do You Know Where Is The Temple That Fulfills Desires With 41 Performances-41 ప్రదక్షణలతో కోరికలు తీర్చే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రుద్రేశ్వరుడుగాఆలయంలో ఎన్నో పూజలందుకుంటున్న ఆ రుద్రునికి 41 సార్లు ప్రదక్షణ చేసి, ఆ పరమేశ్వరుడికి ఎదురుగా ఉన్న నది చెవిలో మన కోరికను చెప్పడం వల్ల ఆ కోరిక కచ్చితంగా నెరవేరుతుందనీ భక్తులు విశ్వసిస్తుంటారు.కాబట్టి కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు రుద్రేశ్వరున్ని పూజిస్తారు.ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయంలోని స్వామి వారికి ప్రతీ మాస శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.ప్రతి సంవత్సరం శివరాత్రికి ఘనంగా ఈ ఆలయంలో జాతర జరుగుతుంది.

ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎడ్లబండినీ చక్కగా అలంకరించుకుని స్వామి వారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటారు

.

#Pradikshanas #Shivalingam #Pooja #Kakatiya #Parameshwara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube