మీకు తెలుసా.. ఉడుతల కోసం రెస్టారెంట్ ఎక్కడ ఉందో..?!

కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు చాలా కూడా మూతపడ్డాయి.ఐదారు నెలల పాటు ఎవరు హోటల్స్ కి వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

 Squirrel, Hotel, Nuts, Writer, Social Media-TeluguStop.com

అయితే ఆ దేశంలో ఉడుతలకు మాత్రం ఓ అద్భుతమైన అవకాశం లభించింది.అంతేకాదు ఆ ఉడుతలకు కొత్తగా ఓ చిన్నపాటి రెస్టారెంట్ ను ఏర్పాటు చేసేలా దారితీసింది.

ప్రతిరోజు ఆ రెస్టారెంట్ కి కొన్ని ఉడుతలు వచ్చి ఆరగించి వెళ్తుంటాయి.వాటికి అవసరమైన ఆహారాన్ని తినేసి సరదాగా జీవితాన్ని గడిపేస్తున్నాయి ఆ ఉడుతలు.

వాటికి ఇష్టమైన ఆహారాన్ని తింటూ ఆ ఉడుతలు అటు ఇటు తిరుగుతూ సరదాగా గడిపేస్తున్నాయి.

ఇకపోతే ఈ రెస్టారెంట్ జార్జియాలోని ఏంజెలా హన్స్‌ బెర్గర్ అనే మహిళ ఈ ప్రయత్నానికి నాంది పలికింది.

ప్రస్తుతం ఈమె చేస్తున్న పని నెటిజెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.అట్లాంటా కు చెందిన ఈవిడ ఫుడ్ రైటర్ గా పని చేసేది.బయట ఉన్న హోటల్స్ కు వెళ్లి అక్కడ దొరికే పదార్థాలకు సంబంధించి రేటింగ్ ఇస్తూ వాటిమీద రివ్యూలు ఇస్తూ ఉంటుంది.అయితే కరోనా సమయంలో ఆ హోటల్స్ మూతపడటంతో ఆవిడ ఉపాధికి బాగా గండిపడింది.

హోటల్లు అన్ని మూసివేయడంతో తనకు రివ్యూలు రాసే పరిస్థితి లేకుండా పోయింది.ఆవిడ ఖాళీగా ఉన్న సమయంలో ఏమి చేయాలో అర్థం కాక తెగ టెన్షన్ పడిపోయింది.

అదే సమయంలో తన పరిస్థితి ఇలా ఉంటే తన కంటే చిన్నప్పాటి జీవులు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆలోచించండి.ఇకపోతే తన ఇంటి ఆవరణలోనే తిరుగుతున్న జాతికి చెందిన ఉడుతలు ఆవిడ కంట పడ్డాయి.

వాటికి ఏదైనా చేయాలనే ఆలోచన లోనే ఈ ఉడుతల రెస్టారెంట్ నిర్మాణం ఆలోచన వచ్చింది.

ఆవిడకు తన మామయ్య పంపిన ఓ చిన్న చెక్క టేబుల్ ను ఉడుతల కోసం ఉపయోగించింది.

ఆ టేబుల్ ను వెంటనే తన ఇంటి ముందున్న గార్డెన్ లో ఉంచి దానిపై ఉడుతలకు సరిపోయేలా చిన్ని చిన్ని ప్లేట్లలో కొన్ని గింజలు ఉంచి పక్కన సాసర్లూ పెట్టి వాటిలో వాల్ నట్స్ ను ఉంచింది.అలా పెట్టిన వాటిని ఉడుత వచ్చి వాటిని మొత్తం తినేసి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత రోజు కూడా అలాగే రావడం మొదలు పెట్టింది.ఇలా వాటి కోసం పూర్తిగా ఏప్రిల్ నెల నుండి ఆహారం దొరికే వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేసింది.

వాటికి రోజుకు ఓ రకంగా ఫుడ్ ఆమె అందిస్తూ రెస్టారెంట్ ను తీర్చిదిద్దింది.బర్త్డే సెటప్, పిక్ నిక్ టేబుల్ ఇలా తనకు తోచిన విధంగా కొత్త కొత్త పద్ధతుల్లో ఆ స్థలాన్ని అలంకరించింది.

ఇలా వాటిపై తనకు తోచిన విధంగా ఆర్టికల్స్ ను రాసి తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది.ఈ రెస్టారెంట్ కి సంబంధించి ఆవిడ మాట్లాడుతూ తనకు ఉపాధితో పాటు ఆనందం కూడా దక్కుతుందని ఆవిడ రాసిన ఆర్టికల్ రూపంలో తెలియజేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube