మొట్టమొదటిసారి గుర్రపుస్వారీ ఎక్కడ, ఎలా మొదలైందో తెలుసా..!

ఈ రోజుల్లో మనకు గుర్రాలు పెద్దగా కనపడడం లేదు.వీటి వాడకం తగ్గింది.

 Do You Know Where And How Horse Riding First Started, Horse,horse Riding, Russia-TeluguStop.com

ఏదైనా రథాలు లాగడానికి కానీ లేదంటే గుర్రపు స్వారీ చేయడానికి కానీ, పెళ్ళిలో వరుడిని ఉరేగించడానికి వంటి సందర్భాల్లో మాత్రమే మనం గుర్రాలను చూస్తున్నాం.గుర్రపు స్వారీ కూడా అందరు చేయరు.

ట్రైనింగ్ అయినా వారు మాత్రమే గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తున్నారు.ఇంకా సినిమాల్లో హీరోలు కూడా గుర్రపు స్వారీ నేర్చుకుని మరి చేస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు మనకు ఈ గుర్రపు స్వారీ ఎక్కడ నుండి మొదలైంది.ఎప్పటి నుండి చేస్తున్నారు.అనే విషయం తెలియదు.అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఈ గుర్రపు స్వారీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా మొదలయ్యిందో ఆధారాలతో సహా కనిపెట్టారు.

బైక్స్, కారులు అందుబాటులోకి వచ్చాక ప్రజలు గుర్రాలను రవాణా కోసం ఉపయోగించడం మానేశారు.కేవలం అరుదుగా మాత్రమే గుర్రాలు కనిపిస్తున్నాయి.

గుర్రాలను రాజుల కాలంలో ఉపయోగించే వారని మనకు కథలు ద్వారా, పురాణాల ద్వారా తెలిసింది.అప్పట్లో కేవలం ప్రయాణాలు కోసం గుర్రాల మీదనే ఆధారపడి జీవించేవారు.అయితే ఈ గుర్రాలు మొదట ఎక్కడ ఉన్నాయి.ఎక్కడి నుండి ప్రపంచం మొత్తం వ్యాపించాయి.

ఈ గుర్రాల వినియోగం ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యింది అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసారు.

Telugu Horse, Intrestinfacts, Russia, Science-Latest News - Telugu

వీటిపై పరిశోధన చేసి సమాధానాలు కూడా కనిపెట్టారు.యూరప్, ఆసియా దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో పురాతన గుర్రాల శిలాజాలకు సంబంధించిన 273 జన్యుక్రమాలను పరిశోధకులు పరిశీలించారు.4200 ఏళ్ల క్రితం రష్యాలోని వోల్గా, డాన్ నదుల వద్ద మొదటగా గుర్రాలను చుసిన మనుషులు వాటిని మచ్చిక చేసుకోవడం మొదలు పెట్టారని పరిశోధనల్లో తేల్చారు.

Telugu Horse, Intrestinfacts, Russia, Science-Latest News - Telugu

యూరప్, ఆసియా దేశాల్లో సుమారు 4 వేల ఏళ్ల క్రితమే కాంస్యయుగం ప్రారంభం అయ్యిందట.ఆ తర్వాత ప్రజలు క్రమంగా విస్తరిస్తూ గుర్రాలను మచ్చిక చేసుకుని వాటిని ప్రయాణాలు కోసం ఉపయోగించడం స్టార్ట్ చేశారట.అక్కడి ప్రజలు గుర్రాలపై స్వారీ చేస్తూ ప్రయాణాలు చేసారని అక్కడి నుండే గుర్రాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube