ఎంతో పవిత్రమైన రావిచెట్టుకు ఎప్పుడు పూజలు చేయాలో తెలుసా?

హిందువులు ఎంతో పవిత్రమైన మొక్కలుగా భావించే వాటిలో రావి చెట్టు ఒకటి.రావిచెట్టును సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపంగా భావిస్తారు.

 Do You Know When To Worship The Raavi Tree Raavi Tree, Pooja, Sunday, Tuesday ,-TeluguStop.com

ఈ క్రమంలోనే రావి చెట్టుకు పూజలు చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు.ఎంతో పవిత్రమైన ఈ రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు.

అయితే ఈ పవిత్రమైన చెట్టును పూజించడానికి పలువురికి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ చెట్టును తాకుతూ పూజ చేయవచ్చా? ఈ వృక్షాన్ని పూజించడానికి అనువైన సమయం ఏది అనే సందేహాలను వ్యక్తపరుస్తుంటారు.మరి రావి చెట్టును ఏ సమయంలో తాకకూడదు ఈ చెట్టుకు ఎప్పుడు పూజలు చేయాలి అనే విషయానికి వస్తే.

పురాణాల ప్రకారం రావి చెట్టును ఏ విధంగా పూజించాలి అనే విషయాలను నారద మహర్షి వివరించినట్లు తెలుస్తోంది.

రావి చెట్టుకు పూజ చేయాలనుకునేవారు సూర్యోదయం తర్వాత నదీస్నానమాచరించి కుంకుమ ధారణ చేసి రావి చెట్టును పూజించాలి.అయితే రావిచెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకుని ఆ తర్వాత రావి చెట్టుకు పూజ చేయాలి.

రావిచెట్టుకు ఏడుసార్లు అభిషేకం చేసి విష్ణు సహస్ర నామాలను చదువుతూ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.రావి చెట్టును తాకుతూ ప్రదక్షిణలు చేయకుండా ప్రతి ప్రదక్షిణం అనంతరం నమస్కరిస్తూ ప్రదక్షణ చేయాలి.

Telugu Ganapathi, Maha Vishnuvu, Pooja, Raavi Tree, Sunday, Tuesday-Telugu Bhakt

ముఖ్యంగా ఈ పవిత్రమైన వృక్షానికి ప్రతి రోజూ పూజలు చేసినప్పటికీ ఆదివారం, మంగళవారం ప్రతిరోజు సంధ్యాసమయంలో ఈ చెట్టును తాకకూడదు.కేవలం శనివారం మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసిన అనంతరం మనలో ఉన్న కోరికలను తెలియజేయడంతో కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా సంతానం లేని వారు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి నిత్యం పూజ చేయటం వల్ల వారికి సంతానయోగం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube