అభిమానుల ముందు జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి డ్యాన్స్ ఎప్పుడు చేశాడో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే.నందమూరి కుటుంబం నుండి పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Do You Know When Junior Ntr First Danced In Front Of Fans, Jr Ntr, Tollywood, He-TeluguStop.com

ఇక ఈయనకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఈయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి 1991లో విడుదలైన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో భరతుడు పాత్రలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్.ఆ తర్వాత బాల రామాయణము సినిమాలో కూడా నటించాడు.

ఇక 2001లో నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ 1, సుబ్బు, ఆది సినిమాలలో హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఆ తర్వాత ఏడాదికి వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్లి స్టార్ హీరోగా నిలిచాడు.

చాలావరకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ లనే సొంతం చేసుకున్నాడు.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోలలో వ్యాఖ్యాతగా చేశాడు.ఇదిలా ఉంటే ఈయన గతంలో అభిమానుల ముందు మొదటిసారి డాన్స్ చేశాడు.

ఇక ఆ డాన్స్ ఎప్పుడు చేశాడంటే.తాను నటించిన శక్తి సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలో చేశాడట.

Telugu Dance, Ntr Danced Fans, Fans, Jr Ntr, Tollywood-Movie

ఎన్టీఆర్ పై ఉన్నా అభిమానంతో ఎంతో మంది అభిమానులు శక్తి ఆడియో ఫంక్షన్ కు తరలివచ్చారు.ఇక ఆ సమయంలో వేదికపై అభిమానుల కోసం ఎన్టీఆర్ ఓ డాన్స్ చేశాడు.ఇక డాన్స్ అనంతరం కొన్ని విషయాలు కూడా పంచుకున్నాడు.ఇప్పటివరకు తాను స్టేజి మీద డాన్స్ పర్ఫార్మెన్స్ ఎప్పుడూ చేయలేదని తెలిపారు.ఫస్ట్ టైం అభిమానుల కోసం ఇక్కడ డాన్స్ చేశానని తెలిపాడు.

Telugu Dance, Ntr Danced Fans, Fans, Jr Ntr, Tollywood-Movie

సినిమాలలో తన డాన్స్ లు చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు అంటూ అందుకే ఇప్పుడు అభిమానుల ముందు డాన్స్ చేసి వారిని ఆనందపరచాలని వారి కోసం స్టెప్స్ వేశాను అని తెలిపాడు.అలా ఎన్టీఆర్ అభిమానుల కోసం మొదటిసారి డాన్స్ చేశాడు.ఇక ఈయన వాళ్ల కోసం ఏమైనా చేయడానికి రెడీ గా ఉంటాడు.

ఇప్పటికే ఎంతో మందికి ఆర్థికంగా కూడా సహాయం చేశాడు.

Telugu Dance, Ntr Danced Fans, Fans, Jr Ntr, Tollywood-Movie

ఈయన కోసం కూడా అభిమానులు ఆయన పేరు మీద ఎన్నో సహాయాలు చేస్తుంటారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు.

ఇక ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు లో హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube