ఈవీఎంలు మ‌న దేశంలో మొద‌టిసారి ఎప్పుడు వినియోగించారో తెలుసా..?

ఎన్నిక‌లు అంటేనే పార్టీలు ఈవీఎంల గోల మొద‌లుపెడుతాయ‌న్న విష‌యం తెలిసిందే.మ‌న దేశంలో పోలింగ్ కేంద్రాల ద‌గ్గ‌ర బ్యాలట్ బాక్సులను ఎత్తుకెళ్ల‌డం లాంటివి ఇప్ప‌టికే ఎన్నో ఘ‌ట‌న‌లు చూస్తూన్నామ్.

 Do You Know When Evms Were First Used In The Country  Evms, Elecions , First Use-TeluguStop.com

కొన్ని సార్లు ఈవీఎంల దుమ‌రాం దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం అయిందో అంద‌రికీ తెలిసిందే.ఏదైనా పార్టీ ఓడిపోయిందంటే వెంట‌నే ఈవీఎంల టాంప‌రింగ్ జ‌రిగిందంటూ ర‌చ్చ మొద‌లు పెట్టేస్తుంది.

మ‌రి ఈవీఎంల‌లోనే రాజ‌కీయ నేత‌ల భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంటుంది.అందుకే వారు ఈవీఎంల గురించి అంత‌లా ఆరా తీస్తూ ఉంటారు.

బ్యాల‌ట్ బాక్సుల్లో రిగ్గింగ్ జ‌రుగుతోంద‌నే కార‌ణంగా ఈవీఎంల‌ను తీసుకొచ్చాయి రాజ‌కీయ పార్టీలు.ఈవీఎంల ఆధారంగానే ఇప్పుడు అన్ని ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.వీటిపై కూడా చాలాసార్లు అనుమానాలు వ‌చ్చాయి.ఓడిపోయిన పార్టీల ఈవీఎంల తీరుపై విమ‌ర్శ‌లు చేయ‌డం కూడా చూస్తూనే ఉన్నాం.

ఇక‌పోతే అస‌లు ఈ ఈవీఎంలు మ‌న దేశంలోకి ఎప్పుడు వ‌చ్చాయి.వీటి ప‌నితీరు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈవీఎంలో రెండు కంట్రోల్ యూనిట్ అలాగే బ్యాలెటింగ్ యూనిట్ అని రెండు ర‌కాలు ఉంటాయి.

Telugu Ballet Boxes, Bengluru, Enganeers, Evms, Kerala, Secrity Codes-Latest New

వీటిని మ‌న దేశంలో మొద‌టిసారిగా కేర‌ళ ఎన్నిక‌ల కోసం మొద‌టిసారిగా వాడారు.1982లోనే వీటిని అందుబాటులోకి తెచ్చారు.ఈవీఎంలు నిమిషానికి కేవ‌లం ఐదు ఓట్లు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.

బ్యాలెట్ యూనిట్ మినిమ‌మ్ 16 మంది అభ్య‌ర్థులు ఉంటారు.ఇలా నాలుగింటితో ఒక్క కాన్సిస్టెన్సీలో 64 మంది వ‌ర‌కు ఇందులో ఉండొచ్చు.

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే 64 మందికంటే ఎక్కువ పోటీ చేస్తే గ‌న‌క అప్పుడు బ్యాలెట్ పేపర్లతో ఎన్నిక‌లు ఉంటాయ‌ని ఆఫీస‌ర్లు చెబుతున్నారు.వీటిని హ్యాక్ చేయ‌డానికి వీలుండ‌దు.

పైగా వీటిని హై సెక్యూరిటీ కోడ్‌ల‌తో మానిట‌రేట్ చేస్తారు.దీనికి సంబంధించిన కోడ్‌లు బెంగులూరులోని వీటిని మానిట‌ర్ చేసే ఇంజినీర్ల‌కు మాత్ర‌మే తెలుసు.

ఇంకెవ‌రికీ వీటి గురించి తెలీదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube