Breakfast Facts: బ్రేక్‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో మీకు తెలుసా?

అదేంటి బ్రేక్‌ఫాస్ట్ ఎప్పటి నుంచి తినడం ఏమిటి? మనిషి పుట్టినప్పటినుండి ఏదో ఒకటి ఉదయాన్నే తినడం సాధారమైన విషయమే కదా అని అనుకుంటున్నారా? అది ప్రతి జీవికీ చాలా సాధారణమైన విషయమే కానీ మనిషి మేధస్సు పెరిగిననాటినుండి ఖచ్చితమైన కొన్ని నియమాలు పెట్టుకున్నాడు.అక్కడినుండే ఒక రోజుకి మూడు పూటల భుజించడం అనే విధానాన్ని పెట్టుకున్నాడు.

 Do You Know When Eating Breakfast Started Details,  Breakfast,eating, Viral Late-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా ప్రధమం.ఒకప్పుడు మనదేశంలో అల్పాహారం అనే కాన్సెప్ట్ లేదు.

అయితే ఇది పాశ్చాత్య దేశాల నుంచి మనకు వచ్చిందని భోగట్టా.

అయితే ఒకప్పుడు మనదగ్గర ముఖ్యంగా భారతదేశం అంతటా ఉదయం భోజనం చేయడం అనేది ఉండేది కాదు.

నేరుగా మధ్యాహ్నం పూట భోజనాన్ని తినేవారు.అయితే ఇప్పటిలా ఒంటిగంట, రెండు గంటల సమయంలో కాకుండా 11 గంటలకే ఆహారాన్ని తీసుకొనేవారు.

అంటే అదే అల్పాహారం, అదే మధ్యాహ్న భోజనం అన్నమాట.అంటే అప్పట్లో రోజుకు 3 పూటలు కాకుండా 2 పూటలే తినేవారు.

అప్పట్లో జనాభాలో ప్రధానంగా రైతులే ఉండేవారు.ఉదయం పూట పొలం పనికి వెళ్లిన రైతులు, కాసేపు పనిచేసుకున్నాక నేరుగా మధ్యాహ్న భోజనాన్ని తినేవారు.

Telugu Breakfast, India Company, India, Stared, Latest-General-Telugu

అయితే ఎప్పుడైతే మన దేశానికి విదేశీయుల రాకపోకలు పెరిగాయో, ఇక అప్పటినుండి ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.17వ శతాబ్ధంలో కాఫీ, టీ, చాక్లెట్లు అధికంగా వినయోగించడం విదేశాల్లో మొదలైంది.దాంతో ఈస్టిండియా కంపెనీ వారు భారతదేశాన్ని పాలించేటప్పుడు వారికి తగ్గట్టు ఆహారపు అలవాట్లను ఇక్కడ మార్చారు అని చెప్పుకోవచ్చు.తమకు అల్పాహారం వండి పెట్టాలని భారత వంటగాళ్లను ఆదేశించేవారు.

అలా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినాలన్న భావన భారతీయుల్లో మొదలైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube