గుడికి ఏ సమయాలలో వెళ్లాలో తెలుసా?

Do You Know What Times To Go To The Temple, Temple,times To Go To The Temple,morning,evening Time,indian Tredition

మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆలయాలను దర్శించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.కొందరు ప్రతిరోజు వారికి సమీపంలో ఉన్న ఆలయాలను సందర్శిస్తుంటారు.

 Do You Know What Times To Go To The Temple, Temple,times To Go To The Temple,mor-TeluguStop.com

మరికొందరు వారానికి ఒక సారి అయినా వారి ఇష్టదైవాన్ని సందర్శించి వారి కోరికలను దేవుని సన్నిధిలో దేవుడికి తెలియజేసుకుంటారు.మరికొందరు మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను దర్శించుకుంటారు.

అయితే కొందరు దేవాలయాలను వారికి వీలున్న సమయంలో దర్శించుకుంటారు.అలా దర్శించుకోవడం మంచిది కాదని, దేవాలయాలను ఏ సమయాలలో దర్శించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

Telugu Time, Indian, Temple, Times Temple-Telugu Bhakthi

సాధారణంగా మనం దేవాలయాలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో దర్శించుకుంటాము.ఉదయం స్నానమాచరించి పరగడుపున దేవాలయాలను దర్శించడం ఎంతో మంచిది.అలాగే ఉదయం శ్రీ మహావిష్ణువు ఆయన అవతారాలైన రాముడు, కృష్ణుడు తదితర దేవాలయాలను దర్శించడం ఎంతో మంచిది.

ఉదయం పూట ఈ దేవాలయాలను సందర్శించడం వల్ల గుడిలో ప్రసాదంగా తులసి తీర్థాన్ని ఇస్తారు.ఈ తులసి తీర్థాన్ని తీసుకోవడం ద్వారా శ్వాసకోశను శుభ్రపరుస్తుంది.అంతేకాకుండా ఉదయమే దేవాలయాన్ని దర్శించడం ద్వారా ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా గడిచి మనం అనుకున్న పనులు సవ్యంగా నెరవేరుతాయని నమ్మకం.

అలాగే సాయంత్రం పూట శివాలయాలను సందర్శించాలి.

శివాలయాల్లో మారేడు తీర్థం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.అంతేకాకుండా ఆ శివుడి అనుగ్రహం మనపై ఉండటం వల్ల మన కోరికలు నెరవేరుతాయి.

ఈ విధంగా గుడికి వెళ్లేటప్పుడు నియమ నిబంధనలను పాటించడం ద్వారా అధిక ఒత్తిడి నుంచి విముక్తి కలిగి ఎంతో సంతోషంగా గడుపుతారు.మనిషి తన పనిని తాను నిర్వర్తిస్తూ ఆ దేవుడు పై విశ్వాసం కలిగి ఉండటం వల్ల సానుకూల దృక్పథంతో ముందుకు పయనిస్తాడు.

ఇలా చేయడం ద్వారా తను అనుకున్న విజయాలను కూడా చేరుకోగలుగుతారు.ఈ విధంగా ప్రతి మనిషికి దైవం ఏదో ఒక రూపంలో తోడవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube