ఆకాశం నుంచి ఈ మహిళ బెడ్ రూమ్ లోకి ఏమొచ్చిందో తెలుసా..??

బయటనే కాదు ఇంట్లో కూడా మనకు తెలియకుండానే ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయని అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.ఎంచక్కా మంచం మీద బయట ప్రపంచంతో సంబంధం లేకుండా హాయిగా నిద్రించే మహిళకు ఆకాశం నుంచి మృత్యువు సరాసరి ఆమె బెడ్ రూమ్ లోకి దూసుకుని వచ్చేసింది.

 Do You Know What This Woman Climbed Into The Bedroom From The Sky-TeluguStop.com

అదృష్టం బాగుండపట్టి తృటిలో ప్రమాదం తప్పింది.లేదంటే నిద్రలో ప్రాణాలు నిద్రలోనే పోయేవి.

దీన్నే కాబోలు అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు దురదృష్టవంతుడిని ఎవరు బాగుచేయలేరు అని అంటారు.అసలు ఇంతకీ ఆకాశం నుంచి ఆ మహిళ నిద్ర పోతున్న బెడ్ రూమ్ లో ఏమి పడింది? ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

 Do You Know What This Woman Climbed Into The Bedroom From The Sky-ఆకాశం నుంచి ఈ మహిళ బెడ్ రూమ్ లోకి ఏమొచ్చిందో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఘటన కెనాడలోని బ్రిటీష్ కొలంబియాలో చోటు చేసుకుంది.అక్టోబర్ 4 వ తారీఖున రూత్ హామిల్టన్ అనే మహిళ తన బెడ్రూమ్ లో హాయిగా నిద్రపోతున్న సమయంలో ఆకాశం నుంచి ఒక ఉల్క ఏకంగా ఆమె బెడ్రూమ్ లోకి దూసుకొచ్చింది.

ఆ ఉల్క కింద పడడంతో పెద్దగా ఢాం అని శబ్ధం రావటంతో ఆమె ఉలిక్కి పడి నిద్రలోంచి లేచి చూసింది.లేచి చూసే సరికి ఆమె బెడ్ మీద ఓ నల్లటి ఆకారం కనిపించింది.

ఒక్కసారిగా షాక్ కు గురైయ్యింది.దాన్ని చూసి భయపడి కొద్ది సేపు అయ్యాక దిక్షణంగా చూసి అదొక ఉల్క అని తెలిసి షాక్ అయింది రూత్ అదృష్టం బాగుండపట్టి తనకి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.

ఒకవేళ ఉల్క ఆమె మీద పడితే ఆమె ప్రాణాలు పోయేవి.ఆ ఉల్కను చూసిన రూత్ హుటాహుటిన ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్‌ చేసింది.

Telugu Avoid, Death, Meteorite, News Viral, Sleeping, Social Media, Viral Latest, Woman-Latest News - Telugu

ఈ ఘటన అనంతరం తెలుకున్న రూత్‌ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.మన జీవితంలో ఏ క్షణాన ఎటువంటి సంఘటనలు జరుగుతాయో ఎవరం ఊహించలేం అని అనటానికి ఈ ఘటనే ఉదాహరణ అని నాకు ఈరోజు ఈ సంఘటన తరువాత అర్థం అయ్యిందని తెలిపింది.మంచంపై నిద్రపోతున్న నాకు ఒక్కసారిగా భారీ శబ్దం వినపడగానే భయం వేసి లేచి చూసేసరికి ఏజరిగిందో నాకేమీ అర్థం కాలేదు.నేను ఆ శబ్దానికి బెడ్‌ మీద నుంచి లేవకపోతే ఈపాటికి నేను చనిపోయి ఉండేదాన్నేమో అంటూ భయం భయంగా చెప్పింది.

నా ప్రాణాన్ని ఇంతలా భయపెట్టిన ఈ ఉల్కను నేను భద్రంగా దాచుకుంటాను.నా తరువాత తారల వారికి నాకు జరిగిన ఈ ఘటన గురించి చెప్పి వాళ్లకు ఈ ఉల్కను చూపిస్తే వాళ్లు చాలా ఆశ్చర్యపడతారు ”అని రూత్ తెలిపింది.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

#Avoid #Meteorite

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు