అసలు గోత్ర నామం అంటే ఏంటో తెలుసా..? అది ఎలా వచ్చిందో తెలుసా..?

ప్రతి హిందువుకు ఓ గోత్రనామం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే.గోత్రనామం లేని హిందూ ఉండడంటే అతిశయోక్తి లేదు.

 Do You Know What The Original Tribal Name Means Do You Know How It Came To Be-TeluguStop.com

హిందువుల్లో ఏ కులమైన సరే కచ్చితంగా వారికి గోత్రనామం అనేది ఉంటుంది.అయితే గోత్ర నామం గురించి చాలామందికి ఎన్నో అపోహలు ఉన్నాయి.

అసలు ఈ గోత్ర నామం అంటే ఏమిటి.? ఈ గోత్ర నామం వారికి ఎలా వచ్చింది…? అన్న విషయాలు చాలా మంది మదిలో వచ్చే ఉంటాయి.అయితే అవి ఎలా వచ్చాయో ఓ సారి తెలుసుకుందామా…

 Do You Know What The Original Tribal Name Means Do You Know How It Came To Be-అసలు గోత్ర నామం అంటే ఏంటో తెలుసా.. అది ఎలా వచ్చిందో తెలుసా..-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదివరకు మన పూర్వీకుల కుటుంబాల వారికి విద్య నేర్పించే గురువులు ఉండేవారు.అయితే అలా కుటుంబ సభ్యులకు విద్య నేర్పినందుకు కారణంగా కుటుంబ గురువు పేరును ఆ కుటుంబం యొక్క గోత్రనామం గా అప్పట్లో మార్చేసుకున్నారు.

అయితే మరి విద్యను అభ్యసించని వారు సంగతి ఏంటి అని అనుకుంటారా…? అయితే అలాంటి వారు వారి పూర్వీకులు లేదా వారి వంశానికి సంబంధించి ఒక మూల పురుషుడి పేరును గోత్రనామం గా చేర్చుకున్నారు.అప్పట్లో వారు కుటుంబానికి విద్య నేర్పిన గురువు పేరును గోత్రనామములు చేసుకున్న వారి కుటుంబ సభ్యులు ఆ తర్వాతి కాలంలో తరతరాలుగా వాటిని కొనసాగిస్తున్నారు.

అయితే ఈ గోత్రనామాలకు సంబంధించి ఓ విషయం కూడా కొంత మందికి అర్థం కాదు.ఒకే కులంలో ఉన్న వ్యక్తులకు ఒకటే గోత్రనామం ఉంటే వారు పెళ్ళి చేసుకోకూడదని.అయితే ఇందుకు సమాధానంగా హిందూ ధర్మ ప్రకారం ఒకే గోత్రం ఉన్న వారు అన్న తమ్ముడు లేదా అన్న చెల్లి అవుతారని చెబుతూ ఉంటారు.హిందూ ధర్మ ప్రకారం ఒకే గోత్రం కలిగిన వారు పూర్వీకులలో వారు ఒకే కుటుంబానికి చెందిన వారు అయి ఉండారని నమ్మకం.

అందుకే కాబోలు ఒకే గోత్రం ఉన్న వారు పెళ్లి చేసుకోకూడదు అని హిందువులు భావిస్తారు.ఒకే గోత్రం ఉన్న అమ్మాయి అబ్బాయి వరుసకు అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్లు అవుతారు.

కాబట్టి ఇప్పటి కాలంలో కొంతమందికి పరిచయం లేకపోయినా వారి పూర్వీకులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఒకే గోత్రం ఉన్న అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోరు.

#Family Members #Sister #Brother #Gotram #Hindu Family

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU