మొలతాడు( Molathadu ) కట్టని వాడు మగవాడే కాదు అని పెద్దలు అంటుంటారు.
అయితే మొలతాడుకు, మగతనానికి మధ్య ఉండే సంబంధాలేంటి అని తెలుసుకుంటే మనకు చాలా ఆసక్తికర విషయాలు అర్థం అవుతాయి.
ముఖ్యంగా హిందూ మతంలో మగవారంతా మొలతాడు కట్టుకుంటారు.దీనిని కట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఎవరికీ అర్ధం కాదు.
ఇలాంటి సందేహాలు అందరికీ ఏదో ఒక సందర్భంలో వస్తాయి.అయితే ఏవి ఎలా ఉన్నా చిన్న పిల్లల విషయంలో నిక్కరు జారి పోతుందనే కారణంతో కడుతుంటారు.
ముఖ్యంగా చిన్న పిల్లలను ఉయ్యాలలో వేసే సందర్భంలో వారికి వెండి మొలతాడు ను అట్టహాసంగా కడుతుంటారు.అయితే ఆ తర్వాత నడుముకు నల్లని తాడును కడతారు.
చిన్ని కృష్ణుడికి( Lord krishna ) బంగారు మొలతాడు ఉండేదని అంతా చెబుతుంటారు.దీనిని పరిశీలిస్తే మనకు పురాతన కాలం నుంచి కూడా ఇలా నడుముకు మొలతాడు కట్టుకునే సంప్రదాయం ఉందని అర్థం అవుతోంది.
అయితే నల్లని తాడును నడుము చుట్టూ కట్టడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం ఉండదని పెద్దలు చెబుతుంటారు.
వేదాలలలో మనకు కొన్ని జీవన సూత్రాలు ఉన్నాయి.స్నానం చేసే సమయంలో పూర్తి నగ్నంగా ఉండకూడదని, శరీరంపై కనీసం చిన్న గుడ్డ అయినా ధరించాలని చెబుతుంటారు.ముఖ్యంగా ఆడ పిల్లలకు చిన్నప్పుడు సిగ్గుబిళ్ల కడుతుంటారు.
వారికి వివాహం జరిగిన తర్వాత మంగళసూత్రం ధరిస్తారు.అయితే అదే తరహాలో మగవారికి కూడా మొలతాడు చాలా ముఖ్యం అనే భావన ఉంది.
చనిపోయినప్పుడు మృత దేహం నుంచి మొలతాడును తీసేస్తారు.దీనిని పవిత్రంగా భావించడం వల్ల ఇలా చేస్తారు.
మొలతాడు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) కూడా ఉన్నాయి.మనం తినే ఆహారం కడుపులోకి వెళ్లేటప్పుడు ఫుడ్ కంట్రోల్‌గా ఉంచడంతో సాయపడుతుంది.ఫలితంగా ఎంత బరువు పెరుగుతున్నారో తెలుస్తుంది.
అంతేకాకుండా అది శరీరంలో ఎంత వేడి ఉందో గ్రహిస్తుంది.శరీరంలో అధిక వేడి ఉంటే వృషణాలలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతుంది.
ఫలితంగా సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడతాయి.అందుకే మొలతాడు కట్టకపోతే వాడు మగవాడు కాదని అంటుంటారు.
దీని వెనుక అంత పరమార్థం ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy