నీటిలో మునిగిపోతున్న జింకను చూసి ఏనుగు ఏం చేసిందో తెలుసా?

సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.ఎప్పుడు… ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు.అందులో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి.

 Do You Know What The Elephant Did When He Saw The Deer Drowning In The Water Wat-TeluguStop.com

అసలు మనం గమనించని చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.నెటిజన్లు వాటిని ఎక్కువగా చూస్తారు.

లైక్ చేస్తారు.కామెంట్ చేస్తారు.

కొన్ని వీడియోలు అయితే మనసుకు హత్తుకుని పోతాయి.అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది.

కష్టాల్లో ఉన్న జింకను చూసిన ఏనుగు చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.ఈ షాకింగ్‌ వీడియో గ్వాటెమాల సిటీలోని లా అరోరా జూ లో జరిగింది.

సాధారణంగా జంతువులు క్రూరంగా ఉంటాయని నమ్ముతారు.కానీ, అది నిజంకాదని చెప్పే అనేక వీడియోలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి.తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.వీడియోలో నీటిలో మునిగిపోతున్న జింక ప్రాణాలను రక్షించడానికి ఏనుగు ఎలా సహాయం చేసిందో చూడొచ్చు.

జూలో ఓ జింకపిల్ల నీళ్లలో పడి మునిగిపోతోంది.దాన్ని చూసిన ఓ గజరాజు.

జింకను కాపాడాలనుకుంటుంది.అందుకోసం ఏం చేయాలో అర్థం కాలేదు.

దాంతో గట్టిగా అరవటం మొదలుపెట్టింది.ఏనుగు ఆందోళనగా అరవటం అర్థం చేసుకున్న జూ సిబ్బంది హుటాహుటినా ఏనుగు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు.

నీటిలో మునిగిపోతున్న జింకను చూసి వెంటనే దాన్ని రక్షించి ఒడ్డుకు చేర్చారు.ఆ జూకీపర్‌ జింకకొమ్మును పట్టుకుని నీటిలో నుండి బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు వీడియోలు స్పష్టంగా చూడొచ్చు.ఇదంతా పక్కనే ఉన్న ఏనుగు చూస్తుంది.దీనిని బట్టి ఏనుగులు అన్ని జంతువుల్లో కెల్లా సున్నితమైన జంతువులుగా పరిగణింపబడుతున్నాయి.మనుషుల మాదిరిగానే భావోద్వేగాలను అవిఅర్థం చేసుకునే శక్తి వాటికి ఉంది.అంతే కాదు కష్టాల్లో ఉన్న మరో జీవిని చూసి అవి చలించిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube