బొడ్డులో కనిపించే ఆ మెత్తటి పదార్థం ఏంటో తెలుసా మీకు...?

మనలో చాలా మందికి బొడ్డు ప్రాంతంలో ఓ ఫైబర్ పదార్థం లాంటిది తరచుగా ఏర్పడుతుంది.ఇలా ఫైబర్ పదార్థం ఏర్పడడం చూసి చాలామంది ఇలా ఎందుకు వస్తుంది…? దీనివల్ల ఎలాంటి ఉపయోగం…? లేదా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి…? అని అనేక డౌట్స్ ఉండనే ఉంటాయి.ఇకపోతే బొడ్డు దగ్గర ఏర్పడే ఫైబర్ లాంటి పదార్థాన్ని బెల్లీ బటన్ లేదా నేవెల్ లింట్ అని పిలుస్తారు.ఇది అందరిలో ఏర్పడక పోయిన చాలా మందిలో మాత్రం ఈ పదార్థం కనబడుతూనే ఉంటుంది.

 Do You Know What That Soft Substance In The Belly Is-TeluguStop.com

అసలు ఇది ఎందుకు ఏర్పడుతుంది…? ఏర్పడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి తెలుసుకుందాం.

సాధారణంగా ఒక మనిషి వివిధ రకాల బట్టలను వేసుకుంటూ ఉంటారు.

 Do You Know What That Soft Substance In The Belly Is-బొడ్డులో కనిపించే ఆ మెత్తటి పదార్థం ఏంటో తెలుసా మీకు…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా ఓ మనిషి వాడే బట్టల నుండి వచ్చే పదార్థంతో పాటు శరీరానికి ఉన్న వెంట్రుకలు కలిసి ఓ ఫైబర్ లాంటి పదార్థం బొడ్డులో ఏర్పడుతుందట.ఇకపోతే ఈ నేవెల్ లింట్ అనే పదార్థం నీలిరంగులో లేదా బూడిద రంగులో కనబడుతుందట.

అయితే, ఇది వారు ఉపయోగించే బట్టల రంగును బట్టి కూడా మారవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.అయితే ఈ పదార్థం ఏర్పడడం ఆడవాళ్ళ తో పోలిస్తే మగవాళ్ళకి చాలా ఎక్కువగా ఏర్పడుతుంది.

ఈ పదార్థం ఏర్పడడానికి ముఖ్యంగా కాటన్ దుస్తులు వాడేవారికి ఎక్కువ వస్తుందట. కాటన్ దుస్తులను ధరించేటప్పుడు వాటిని కచ్చితంగా ఓసారైనా వాష్ చేసిన వాటిని ఉపయోగిస్తే ఇలాంటి పదార్థం ఏర్పడదని నిపుణులు తెలుపుతున్నారు.

ఆడవారితో పోలిస్తే మగవారికి ఎందుకు ఎక్కువగా ఏర్పడుతుందన్న విషయానికి కారణం ఏమిటంటే… ఆడవారితో పోలిస్తే మగవారికి శరీర భాగంలో ఎక్కువ వెంట్రుకలు ఉండడమే.ఇలా ఎవరికైనా ఇలాంటి పదార్థం రావడం ఇష్టం లేకపోతే వారు షేవింగ్, వ్యాక్సింగ్ లేదా లేజర్ ట్రీట్మెంట్ లాంటి హెయిర్ రిమూవల్ పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఈ పదార్థం ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు.

అయితే ఇది ఏర్పడడం వల్ల మనిషికి ఎటువంటి ప్రమాదం లేదని నిపుణులు తెలుపుతున్నారు.అయితే ఎప్పటికప్పుడు బొడ్డు లోని పదార్థాన్ని తీసి వేసుకుంటూ ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

#Hair #Novel #Hair Removel #Novel Lint #Fiber Metal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు