బిగ్ బాస్ ఎంట్రీపై సురేఖ వాణి ఏం చెప్పిందో తెలుసా?

టాలీవుడ్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Do You Know What Surekha Van About Bigg Boss Entry-TeluguStop.com

బుల్లితెరలో యాంకర్ గా కూడా చేసింది సురేఖ వాణి.ఈ మధ్య తన పరిచయాన్ని సోషల్ మీడియా వేదికగా బాగా పెంచుకుంటుంది.

అంతే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడ సంపాదించుకుంది.ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ ఎంట్రీ గురించి స్పందించింది సురేఖవాణి.

 Do You Know What Surekha Van About Bigg Boss Entry-బిగ్ బాస్ ఎంట్రీపై సురేఖ వాణి ఏం చెప్పిందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమధ్య ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం బాగా దగ్గరగా ఉంటుంది.తన భర్త మరణించిన తర్వాత సురేఖ వాణి లో మార్పులు చాలా వచ్చాయని చెప్పవచ్చు.

తన కూతురు సుప్రీతతో కలిసి తెగ డాన్సులు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.పైగా సురేఖవాణి తన గ్లామర్ ను కూడా పెంచేసింది.కూతురితో పోటీగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా కామెంట్స్ కూడా ఎదురుకుంటుంది.

Telugu Bigg Boss, Deleted, Instagram, Second Marriage, Social Media, Supreeta, Surekha Vani, Surekha Vani Clarity, Tollywood, Viral-Movie

గతంలో తాను రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వినిపించగా.వెంటనే ఈ వార్తకు స్పందించి పుకార్లను తోసిపుచ్చింది.ఇక గత కొన్ని రోజుల నుండి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గురించి అప్ డేట్ లు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి తెగ వార్తలు కూడా వినిపించాయి.అందులో సురేఖ వాణి కూడా వస్తుందని గతంలో ప్రకటించారు.ఇక తాజాగా ఈ విషయం గురించి తన సోషల్ మీడియా వేదికగా స్పందించి తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంలేదని తెలిపింది.

Telugu Bigg Boss, Deleted, Instagram, Second Marriage, Social Media, Supreeta, Surekha Vani, Surekha Vani Clarity, Tollywood, Viral-Movie

అంతే కాకుండా ఇటువంటి పుకార్లను ఎంకరేజ్ చేయకండి అంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.ఇక ఆ పోస్ట్ వైరల్ గా మారిన కొద్ది క్షణాల్లోనే వెంటనే డిలీట్ చేసింది సురేఖ.దీంతో నెటిజన్లు మళ్లీ పోస్ట్ ఎందుకు డిలీట్ చేసిందని తెగ ప్రశ్నలు వేస్తున్నారు.

ఇక ప్రస్తుతం సురేఖ వాణి పేరుతో పాటు మరి కొందరు సెలబ్రెటీల పేర్లు కూడా వైరల్ గా మారగా.అందులో పాల్గొనేవాళ్ళు ఎవరాని క్లారిటీ మాత్రం లేకుండా పోయింది.

#Viral #Second Marriage #Social Media #Bigg Boss #Instagram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు