కొబ్బరికాయ కొట్టే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం చేసినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము.శుభకార్యం ప్రారంభించే సమయంలో ఆ కార్యానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని కొబ్బరికాయ కొడతాము.

 Do You Know What Rules To Follow When Beating Coconut, Coconut, God, Rules, Wors-TeluguStop.com

అదేవిధంగా ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించుకున్న అనంతరం మన జీవితంలో అన్ని శుభాలే జరగాలని దేవుడికి కొబ్బరికాయ కొట్టడం మనం చూస్తుంటాము.

ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు.

అయితే కొబ్బరికాయ కొట్టడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు.కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.

మరి ఆ నియమాలు ఏమిటి అనే విషయానికి వస్తే…టెంకాయ కొట్టడం అంటే శాంతి కారకం. అరిష్ట నాశకం.

కొబ్బరికాయ కొట్టి దేవుడి ముందు పెట్టడం వల్ల అరిష్టం వెళ్ళిపోయి శాంతి కలుగుతుందని అర్థం.

ఇలాంటి శుభం కలిగించే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయ మొత్తం నీటిలో కడిగి పీచు ఉన్న వైపు మాత్రమే పట్టుకుని కొట్టాలి.

అదేవిధంగా మనం టెంకాయ కొట్టటానికి ఉపయోగించే రాయి ఎల్లప్పుడూ కూడా ఆగ్నేయ దిశలో ఉండాలి.మనం కొట్టిన టెంకాయి సమంగా పగిలితే అదృష్టానికి సంకేతము.

అలాకాకుండా కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల  కుళ్ళి పోయినట్టు అనిపిస్తే వెంటనే శివాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవడం వల్ల అక్కడితో ఆ దోషం తొలగిపోతుంది.కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని ఒక గిన్నెలో తీసుకొని కొబ్బరి, అటుకులు, చక్కెర కలిపి నైవేద్యంగా సమర్పించడం ఎంతో ఉత్తమం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube