పోసానిని చూడగానే పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా.. వైరల్?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

 Do You Know What Pawan Kalyan Did When He Saw Posani In Maa Voting, Pawan Kalyan-TeluguStop.com

ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపి నాయకుడిగా సినిమా నటుడు, రచయితగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అతని పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని అన్నట్టు గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.

ఈ క్రమంలోనే పవన్ అభిమానులు పోసాని కృష్ణ మురళి ని టార్గెట్ చేస్తూ అతనికి వందలు కొద్దిగా ఫోన్ కాల్స్ మెసేజ్ లు వెళుతున్నాయని మీడియా ముందు తన బాధను వెళ్లగక్కారు.ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను మాట్లాడుతూ తన కుటుంబ సభ్యుల పై ఎన్నో ఆరోపణలు చేశారు.

ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పై దాడి చేయడమే కాకుండా ఆయన ఇంటిపై రాళ్లదాడి కూడా చేశారు.ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళి గత కొద్దిరోజుల నుంచి ఎవరి కంటా కనపడకుండా ఉన్నారు.

Telugu Maa, Pawan Kalyan, Posanipawan, Posanukrishna, Republic, Sai Dharam Tej,

అక్టోబర్ 10వ తేదీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం వచ్చారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఎన్నికల కేంద్రం వద్దకు వచ్చారు.ఇలా ఒకరికొకరు ఎదురు పడటం పవన్ కళ్యాణ్ పోసాని చూస్తూ మారుమాట్లాడకుండా అక్కడినుంచి తన కారులో వెళ్ళిపోయాడు.ఎన్నికల కేంద్రానికి వచ్చిన పోసాని కూడా ఎంతో తొందరగా తన ఓటుని వినియోగించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

మీడియా వీరిని చుట్టుముట్టి ప్రశ్నలు వేసినప్పటికీ ఏ మాత్రం స్పందించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube