తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ( Director Krishna Vamsi )… ఈయన చేసిన ప్రతి సినిమాలో హీరోల క్యారెక్టరైజేశన్ చాలా కొత్తగా ఉంటుంది.అలాగే హీరోయిన్లను కూడా చాలా అందంగా చూపిస్తూ ఉంటాడు.
అందువల్లే ఆయనకి క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరు కూడా వచ్చింది.ఇక ఇలాంటి క్రమంలో ఆయన నాగార్జునతో చేసిన నిన్నే పెళ్లాడుతా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.కానీ ఆయన చేసిన సినిమాల్లో కూడా ఆయన కి కొన్ని సినిమాలంటే నచ్చవంట…జగపతిబాబు హీరోగా ఆయన చేసిన సముద్రం సినిమా( Samudram Movie ) అంటే ఆయనకు నచ్చడట.
అలాగే సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్ లను హీరోలుగా పెట్టి ఆయన చేసిన ‘నక్షత్ర ‘( Nakshatra ) అనే సినిమా కూడా నచ్చలేదట.దానికి కారణం ఆయన మేకింగ్ లో చాలా వరకు ఫాల్ట్ ఉండడమే అని ఆయనే ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.ఇక ఇప్పుడు ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా లేకపోయిన కూడా అప్పుడప్పుడు సినిమాలు అయితే చేస్తున్నాడు.ఇక మొత్తానికైతే ఆయనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఇండస్ట్రీలో ఆయన ఎప్పటికప్పుడు జనాన్ని ఉత్తేజపరుస్తూ మంచి సినిమాలు చేస్తూ వచ్చేవాడు.అలాంటి కృష్ణవంశీ ఇప్పుడు ఫేడౌట్ దశకు చాలా దగ్గరగా ఉండడం అనేది నిజంగా ఒక వంతుకు బాధాకరమైన విషయమనే చెప్పాలి.కానీ ఆయన కనక ఇప్పుడు కన్సెంట్రెట్ చేసి మంచి సినిమా కనక చేయగలిగితే మళ్ళీ తను కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందుతాడు… ఇక ఇది ఇలా ఉంటే ఈయన రీసెంట్ గా చేసిన రంగ మార్తాండ( Rangamarthanda ) అనే సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది…
.