శ్రీ కృష్ణ పరమాత్ముడు అన్నదానం గురించి ఏం చెప్పారో తెలుసా?  

శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా ఎన్నో మంచి విషయాలను సమస్త లోకానికి తెలియజేశారు.ఇందులో భాగంగానే అన్నం గురించి కూడా భగవద్గీతలో ఎంతో అద్భుతంగా ప్రస్తావించాడు.

TeluguStop.com - Do You Know What Lord Krishna Said About Annadanam

శ్రీకృష్ణుడు అన్నం గురించి ఏం చెప్పాడంటే….అన్నం ఆ భగవంతుని సొంతం… మనది మాత్రం కాదు అని భగవద్గీత ద్వారా తెలియజేశారు.

సరైన సమయంలో వర్షాలు కురిపించి దాన్ని పండిస్తున్నారు కాబట్టి ఆ ధాన్యం నుంచి తయారయ్యే అన్నం ఆ భగవంతునికే చెందుతుందని తెలిపారు.

TeluguStop.com - శ్రీ కృష్ణ పరమాత్ముడు అన్నదానం గురించి ఏం చెప్పారో తెలుసా-Devotional-Telugu Tollywood Photo Image

మన జీవనాధారం భోజనం పైనే ఆధారపడి ఉంటుంది.

మనం జీవించాలంటే భోజనం తప్పకుండా ఉండాలి.భోజనం లేనిదే జీవం కూడా లేదు.

ఇంతటి విలువైన భోజనాన్ని మనకు అందించిన ఆ దేవుని కి ఎల్లప్పుడు మనం కృతజ్ఞులమై ఉండాలి.మనం భోజనాన్ని తయారు చేసుకుని తినేటప్పుడు వాటిలో కొంత భాగం ఆ దేవుడికి నివేదనగా సమర్పించాలి.

తిరిగి ఆ నివేదనను సమస్త ప్రాణకోటికి పెట్టడం ద్వారా పుణ్య ఫలం దక్కుతుంది.

మన శరీరం పంచకోశములుతో నిర్మితమై ఉంటుంది.

అందులో ముఖ్యమైనది అన్నమయకోశం, ప్రాణమయకోశం అందుకే శరీరంలో అన్నమయ కోశం శరీరం గాను,ప్రాణమయ కోశం ఆత్మగాను భావిస్తారు. సద్గృహస్తులు అతిథులకు అన్నం సిద్ధంగా ఉందని,అతిథులు ఏ సమయంలో ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టడానికి వీరు సిద్ధంగా ఉంటారు.

అలాంటి వారికి ఎల్లప్పుడు ఆహారంలో లోటు లేకుండా నిత్యం ధనధాన్యాలు పొందుతారు.

ఎవరైతే ఇక తప్పదు అన్నట్టుగా వండిన అన్నాన్ని అతిథులకు సమర్పిస్తారో, అలాంటి వారికి వారి జన్మాంతం అంతే తక్కువ శ్రద్ధతో సమర్పించబడిన అన్నం తిరిగి వారికి చాలా అరుదుగానే దొరుకుతుంది.

మరి కొంతమంది ఎవరైనా అతిథులు,అభాగ్యులు ఇంటికి వచ్చి అన్నాన్ని అడిగితే వారికి ఎంతో నీరసంగా అన్నంలేదు పో.అని అంటారు.అలాంటి వారికి అన్నం దొరకడం ఎంతో కష్టం అవుతుంది.కాబట్టి ఇంటికి ఏ సమయంలోనైనా అభాగ్యులు వచ్చినప్పుడు వారికి కొంతవరకు అన్నాన్ని పెట్టడం ద్వారా ఆ భగవంతుని ఆశీస్సులు పొంది నిత్యం అన్నానికి కొదవ లేకుండా మనకు ప్రసాదిస్తాడని, శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీత ద్వారా తెలియజేశారు.

#Annadanam #LordKrishna #Bhagavadgita #Lord Krishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL