సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితం ఎంతో సుఖసంతోషాలతో , అష్టైశ్వర్యాలతో నిండి ఉండాలని భావిస్తుంటారు.ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే మనం మంచి ప్రవర్తనతో నేర్చుకోవడంతో పాటు ఇతరుల పట్ల ప్రేమ, జాలి కలిగి ఉన్నప్పుడే ఆ దేవుని అనుగ్రహం మనపై కలిగి ఉండి మనకు మంచి చేస్తాడు.
ఈ విధంగా మన జీవితం సంతోషంగా ఉండాలంటే కొందరు ఇంట్లో వివిధ రకాల యంత్రాలను ఉంచుకొని పూజలు నిర్వహిస్తుంటారు.మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎక్కువ మంది లోహాలతో తయారు చేసినటువంటి తాబేలు ఆకారంలో ఉండే సామాగ్రి ఉపయోగిస్తుంటారు.
వీటిని ఇంట్లో పెట్టుకొని పూజ చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు.అయితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే.
మన ఇంట్లో సకల సంపదలు కలగాలంటే ఎలాంటి యంత్రాలను ఇంట్లో ఉంచుకుని పూజ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా మన ఇంట్లో వెండి, రాగి, ఇత్తడి లోహాలతో తయారు చేసిన యంత్రాలను పెట్టి పూజలు చేస్తుంటాము.
ఈ యంత్రాల పైన రేఖల రూపంలో, బీజాక్షరాలతో దైవీశక్తిని ఆవాహనం చేస్తారు.యంత్రాల తయారీలో ఎంతో నిబద్ధత కలిగి ఉండాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.మనం ఇంట్లో పూజలు చేసుకునేటటువంటి యంత్రాల పైన కేవలం గీతలు, రేఖలు ఉండేటటువంటి వాటిని తీసుకుని ఇంట్లో పూజ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
మనం ఏ దేవుడికి లేదా దేవత యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలని భావిస్తామో ఆ సంబంధిత దేవతా మంత్రాలను పునశ్చరణ చేసి యంత్రాలకు ప్రాణప్రతిష్ట చేసినప్పుడే వాటిలోని దైవశక్తి కొలువై ఉంటుంది.కేవలం ఈ విధమైనటువంటి యంత్రాలను మాత్రమే పూజ గదిలో ఉంచి పూజలు చేసినప్పుడు మనకు మంచి ఫలితాలు దక్కుతాయి.ఈ విధంగా కాకుండా గీతలు రేఖలు మాత్రమే ఉన్నటువంటి యంత్రాలకు పూజ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
కేవలం అటువంటి యంత్రాలు మన ఇంట్లో అలంకారప్రాయంగా మాత్రమే ఉండిపోతాయి.కనుక మన ఇంట్లో ఇటువంటి యంత్రాలను పూజించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు
.