వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా కొలిచేది వినాడకుడినే. కోరిన కోర్కెలు తీరుస్తూ.

 Do You Know What Is The Symbol Of Ganeshas Body Details, Vinayakudu, Ganesha Bod-TeluguStop.com

చేసే పనుల్లో ఎలాంటి ఆటంకం కల్గకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడి పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు.మరి అలాంటి గణేషుడి శరీరంలోని ఒక్కో భాగం ఒక్కో దానికి సంకేతమన్న విషయం మీకు తెలుసా? తెలియక పోయినా పర్లేదండి.వినాయకుడి గొప్పదనంతో పాటు ఆయన శరీర భాగాలు దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వినాయకుని తొండము ఓం కారానికి సంకేతమని పురాణాలు చెబుతున్నాయి.అలాగే గణేషుడికి చిన్నప్పుడు అతికించిన ఏనుగు తల జ్ఙానానికీ, యోగానికీ చిహ్నంగా వివరిస్తారు.అంతే కాదండోయ్… మనిషి శరీరము మాయకూ, ప్రకృతికీ సూచికట.

ఆయన తేతిలో ఉన్న పరశువు అజ్ఙానాన్ని ఖండించడానికి సంకేతమట.మరో చేతిలో ఉన్న పాశము విఘ్నాలను కట్టి పడసే సాధనమట.

వినాయకుడి విరిగిన దంతం త్యాగానికి గుర్తని పురాణాలు చెబుతున్నాయి.ఆయన మెడలో ఎప్పుడూ మెరిసే మాల జ్ఙాన సముపార్జనకు గుర్తట.

అలాగే పెద్ద చెవులు భక్తుల కోరికలను వినేందుకట.

పెద్ద చెవులతో విని వెంటనే కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం.అలాగే విఘ్నేశ్వరుడి పొట్టపై ఉన్న నాగ బంధము శక్తికి, కుండలినికి సంకేతాలట.ఎప్పుడూ వినాయకుడి పక్కనే ఉండే చిన్నారి ఎలుక జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి అని చెప్పేందుకు నిదర్శనమట.

అంతే కాదండోయ్ ఈయన పక్కనే ఉండే ఆ చిన్నారి ఎలుక ఈ బొజ్జ గణేషుడికి బుజ్జి వాహనం.

Do You Know What Is The Symbol Of Ganeshas Body Details, Vinayakudu, Ganesha Body, Sacrifice, Ganesh Tooth, Hindu Puranas, Omkaaram, Knowledge, Vighneshwarudu - Telugu Devotional, Ganesh Tooth, Ganesha, Ganeshudu, Hindu Puranas, Knowledge, Omkaaram, Vighneshwarudu, Vinayakudu

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube