ఆర్టిఫిషియల్ హార్ట్ గురించి మీకు తెలుసా...ధర ఎంతంటే..?

మనిషి శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవాల్లో గుండె కూడా ఒకటి.గుండె అనేది కొట్టుకోవడం ఆగిపోతే మనిషి ప్రాణం పోతుందనే విషయం అందరికి తెలిసిందే.

 Do You Know What Is The Price Of Artificial Heart Shallotte Man , First In U.s.,-TeluguStop.com

అయితే మన వైద్యులు కనిపెట్టిన హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా పాడయిపోయిన గుండె స్థానంలో మరొకరి గుండెని అమర్చే అరుదైన చికిత్స మనకు అందుబాటులోకి వచ్చింది.అయితే ఇప్పుడు ఫ్రెంచ్ కి చెందిన శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ గుండెని తయారు చేసి దానిని అవసరమైన వ్యక్తికి అమ్మినట్లు తెలుస్తుంది.

అసలు కృత్రిమ గుండె ఏంటి.? దానిని అమ్మడం ఏంటి అనుకుంటున్నారా.?!

అసలు వివరాల్లోకి వెళితే.ప్రెంచ్ కి సంబందించిన కృత్రిమ శరీర అవయవాల తయారీ సంస్థ అయిన “కార్మెంట్ ” మొదటిసారిగా ఒక కృతిమ గుండెను అమ్మకానికి పెట్టింది.

ఓ ఇటలీ పేషెంట్ కి హార్ట్ ట్రాన్స్ ఫ్లాంట్ కోసం ఈ కృత్రిమ గుండెను అమ్మినట్లు కార్మెంట్ తెలిపింది.అయితే ఈ సంస్థ ప్రారంభం అయ్యి ఎన్నో సంవత్సరాలు అవుతున్నాగాని తాము ఆర్టిఫిషియల్ హార్ట్ ని అమ్మడం ఇదే తొలిసారి అని సంస్థ తెలిపింది.

ఇలా కృత్రిమ హార్ట్ లను విక్రయించేందుకు 2020 డిసెంబర్‌లో కంపెనీకి యూరోపియన్ సీఈ మార్కింగ్‌ అనుమతి పొందింది.

Telugu Dollars, Shallotte, Latest-Latest News - Telugu

ఇటలీలోని నేపల్స్ లోని ఆర్టిఫిషియల్ హార్ట్స్ విభాగంలో గొప్ప అనుభవం కలిగిన అజియెండా ఓస్పెడలియరా డే కొల్లి హాస్పిటల్ లో హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ సైరో మైయల్లో నేతృత్వంలోని టీమ్ ఈ కృత్రిమ గుండె ఆపరేషన్ ని విజయవంతంగా నిర్వహించిందని కార్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది.ఈ కృత్రియ హార్ట్ కోసం ఏకంగా 1,77,000 డాలర్లకు పైగా ప్రాంతీయ ఆరోగ్య వ్యవస్థ ద్వారా చెల్లించబడ్డాయని ఆ సంస్థ తెలిపింది.అలాగే రానున్న రోజుల్లో ఫ్రాన్స్, జర్మనీలలో మరికొందరికి కృత్రిమ గుండె విక్రయించడంలో సహాయపడతామని ఆ సంస్థ పేర్కొంది.

నిజంగా కృత్రిమ గుండెను తయారు చేయడం అది ఒక మనిషికి అమర్చడం అనేది గర్వించదగ్గ విషయం కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube